వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి (YCP Social Media Incharge) సజ్జల భార్గవ రెడ్డి (Sajjala Bhargav Reddy)పై పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. సింహాద్రిపురం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవరెడ్డి తో పాటు వర్రా రవీందర్ రెడ్డి, అర్జున్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో సజ్జల భార్గవరెడ్డి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. జగన్ అండతో రెచ్చిపోయాడు. సోషల్ మీడియా ను చేతులో పెట్టుకొని ఎన్ని చెయ్యాలో అన్ని చేసాడు. పెద్ద ఎత్తున టీం ను ఏర్పాటు చేసి అప్పటి ప్రతిపక్ష పార్టీలు టీడీపీ , జనసేన నేతలను టార్గెట్ గా చేసి వారిపై ట్రోల్స్ చేయడం , వీడియోస్ చేయడం, బూతులు తిట్టడం ఇలా ఎన్నో చేసి పైశాచిక ఆనందం పొందారు. ఇన్ని చేసిన వీరిపై కూటమి బదులు తీర్చుకోకుండా ఉంటుందా..? అందరి లెక్క సరిచేసి..ఎలాంటి శిక్షలు వేయాలో..ఏ రేంజ్ లో వేయాలో అన్ని సిద్ధం చేసింది. కేవలం నేతలనే కాదు జగన్ అండ చూసుకొని నోర్లు పారేసుకున్న వారి లెక్కలు సైతం సరిచేసే పనిలో పడింది. ఓ పక్క నేతలపై కేసులు పెట్టి జైలు వేస్తూనే మరోపక్క సోషల్ మీడియా వారిపై నిఘా పెట్టి అరెస్టుల పర్వం స్టార్ట్ చేసింది. దీంతో వైసీపీ కి జై కొట్టిన వారంతా ఇప్పుడు భయం తో వణికిపోతున్నారు.
తాజాగా వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవ రెడ్డిపై పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదైంది. సింహాద్రిపురం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భార్గవ్ తో పాటు వర్రా రవీందర్ రెడ్డి, అర్జున్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ప్రశ్నించడంతో తనను కులం పేరుతో దూషించారని ఫిర్యాదుదారుడు పేర్కొన్నాడు. కాగా ఇప్పటికే ఓ కేసులో వర్రా కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక ఏపీ రిజల్ట్స్ వచ్చిన రోజు నుంచే సజ్జల భార్గవ్ రెడ్డిని అండర్ గ్రౌండ్‌కు పంపించి వేశారు. గతంలో మంగళగిరి కార్యాలయంలో ఉండే ఆయన ఇప్పుడు ఎక్కడా కనిపించడంలేదు. ఫోన్లకు అందుబాటులో లేరు. మరి ఇక ఇప్పుడు పోలీసులు ఆయన కోసం గాలింపు చేస్తున్నారు.
Read Also : Gangavva : బిగ్ బాస్ హౌస్ నుంచి గంగవ్వ అవుట్..!