AP : ఏపిలో 81 శాతం పోలింగ్‌: సీఈవో ముఖేశ్‌ కుమార్‌ మీనా

Ap Lok Sabha Elections: ఏపిలో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు నిన్న పోలింగ్‌ ముగిసింది. అయితే గతంలో చూడని విధంగా ఏపిలోని పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలి వచ్చారు. దీంతో నిన్న సాయంత్రం 5 గంటల సమయానికే 68 శాతం పోలింగ్‌ నమోదైంది. దీనిపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా(Chief Election Officer of AP is Mukesh Kumar Meena) స్పష్టత నిచ్చారు. రాష్ట్రంలోని కొన్ని […]

Published By: HashtagU Telugu Desk
81 percent polling in AP: CEO Mukesh Kumar Meena

81 percent polling in AP: CEO Mukesh Kumar Meena

Ap Lok Sabha Elections: ఏపిలో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు నిన్న పోలింగ్‌ ముగిసింది. అయితే గతంలో చూడని విధంగా ఏపిలోని పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్లు భారీగా తరలి వచ్చారు. దీంతో నిన్న సాయంత్రం 5 గంటల సమయానికే 68 శాతం పోలింగ్‌ నమోదైంది. దీనిపై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్ కుమార్ మీనా(Chief Election Officer of AP is Mukesh Kumar Meena) స్పష్టత నిచ్చారు. రాష్ట్రంలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రాత్రి 2 గంటల వరకు కూడా పోలింగ్ జరిగిందని వెల్లడించారు. పూర్తి పోలింగ్ శాతం వివరాలు ఇవాళ అందుతాయని చెప్పారు.

We’re now on WhatsApp. Click to Join.

2019 ఎన్నికల్లో పోలింగ్ బూత్ ల ద్వారా 79.2 శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. 0.6 శాతం పోస్టల్ బ్యాలెట్ తో కలిపి 79.8 శాతం పోలింగ్ నమోదైందని వివరించారు.

Read Also: Ram Charan : బెస్ట్ హస్బండ్ మాత్రమే కాదు బెస్ట్ థెరపిస్ట్ కూడా..!

ఈసారి ఎన్నికల్లో రాత్రి 12 గంటల వరకు 78.25 శాతం ఓటింగ్ నమోదైందని మీనా వివరించారు. 1.2 శాతం పోస్టల్ బ్యాలెట్ తో కలిపి 79.4 శాతం పోలింగ్ నమోదైనట్టు స్పష్టం చేశారు. అన్ని పోలింగ్ బూత్ ల నుంచి వచ్చే వివరాలు పరిశీలిస్తే, తమ అంచనా ప్రకారం 81 శాతం పోలింగ్ నమోదు కావొచ్చని అన్నారు.

 

  Last Updated: 14 May 2024, 05:03 PM IST