Site icon HashtagU Telugu

Ganja : మంగ‌ళ‌గిరిలో భారీగా గంజాయి స్వాధీనం.. ఇద్దరు నిందితుల అరెస్ట్

Ganja

Ganja

ఏపీలో గంజాయి అక్ర‌మ ర‌వాణా జోరుగా సాగుతుంది. పోలీసులు నిఘా పెట్టిన అక్ర‌మార్కులు వారి క‌ళ్లుగ‌ప్పి గంజాయిని త‌రలిస్తున్నారు. తాజాగా మంగ‌ళ‌గిరి స‌మీపంలోని కాజా టోల్‌గేట్ వ‌ద్ద పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కారులో అక్రమంగా తరలిస్తున్న 77 కేజీ ల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్ ఈ బీ సీఐ మారయ్య బాబు తెలిపారు. ఎస్ ఈ బీ హెడ్ క్వార్టర్స్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కె మహేశ్వరరాజు, గుంటూరు ఎస్ ఈ బీ అడిషనల్ సూపరింటెండెంట్ డీఎన్ మహేష్ పర్యవేక్షణలో సిబ్బందితో క‌లిసి కాజ టోల్ గేట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. అదే సమయంలో డీఎల్ 8 సీబీ వీ 0900 నెంబరు కలిగిన కారును ఆపి తనిఖీ చేయగా 77 కేజీల గంజాయి ని గుర్తించి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. విశాఖ జిల్లా అంగనంపూడి వద్ద నుంచి బెంగుళూరుకు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన సోహైల్ పాషా, ఇమ్రాన్ అహ్మద్ లను అరెస్టు చేసినట్లు తెలిపారు. గంజాయి అక్రమ రవాణా కు కారకుడైన బెంగుళూరు కు చెందిన ముహమ్మద్ సూఫీయల్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ ఈ బీ సీఐ మారయ్య బాబు తెలిపారు.

Also Read:  TDP Telangana : తెలంగాణలో పోటీపై టీడీపీ కీలక నిర్ణయం.. ఇదే!