Mana Desam : ఎన్‌టీఆర్ ‘మన దేశం‘ మూవీకి 75 ఏళ్లు.. నారా భువనేశ్వరి ఎమోషనల్ ట్వీట్

మన దేశం(Mana Desam) మూవీ వజ్రోత్సవ వేళ ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు వారందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
Ntr Mana Desam Movie Diamond Jubilee Celebration Nara Bhuvaneswari

Mana Desam : నట సార్వభౌముడు ఎన్‌టీఆర్ భౌతికంగా లోకంలో లేకున్నా..  తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తెలుగుజాతిపై, తెలుగు సినీ రంగంపై ఆయన చెరిగిపోని ముద్రను వేశారు. ఆయన నటించిన ప్రతీ సినిమా.. మూవీ ఇండస్ట్రీలో ఒక ఐకాన్‌గా నిలిచిపోయింది. ఎంత గొప్ప, సుదీర్ఘ ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది.  దివంగత ఎన్‌టీఆర్ సినీ ప్రస్థానం కూడా ఒక్క సినిమాతోనే మొదలైంది. ఆ మూవీ పేరే.. ‘మన దేశం’. 75 ఏళ్ల క్రితం ఎన్‌టీఆర్ ఈ మూవీ ద్వారా తొలిసారిగా వెండితెరపై తెలుగువారికి కనిపించారు. ఆ సినిమాను గుర్తు చేసుకుంటూ ఇవాళ ఎన్‌టీఆర్ కుమార్తె నారా భువనేశ్వరి ఒక ఎమోషనల్ ట్వీట్ చేశారు.

Also Read :President Vs Vice President : అవసరమైతే దేశాధ్యక్షుడినే చంపిస్తా.. ఫిలిప్పీన్స్‌ వైస్ ప్రెసిడెంట్ వార్నింగ్

ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు సినీ ప్రేక్షకులకు ఈరోజును (నవంబరు 24) చిరస్మరణీయ దినంగా నారా భువనేశ్వరి అభివర్ణించారు. 75 ఏళ్ల కిందట 1949 నవంబర్ 24న మన దేశం సినిమా ద్వారా ఎన్‌టీఆర్ తొలిసారిగా వెండితెరపై కనిపించారని ఆమె గుర్తు చేసుకున్నారు.  ‘మనదేశం’ మూవీకి ఈ రోజు వజ్రోత్సవ వేళ  అని భువనేశ్వరి చెప్పారు. మనదేశం మూవీలో పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్ పాత్రలో ఎన్‌టీఆర్ నటించారన్నారు.

Also Read :Actor Ali : ఫామ్‌హౌస్‌లో అక్రమ నిర్మాణాలు.. కమేడియన్ అలీకి అధికారుల నోటీసులు

‘‘మనదేశం సినిమాతో తెలుగు మూవీ ఇండస్ట్రీలో ఒక స్వర్ణశకం మొదలైంది. మా నాన్న (ఎన్‌టీఆర్) సినీ ప్రయాణం, ఆయన నటనా విశ్వరూపాన్ని తలుచుకుంటుంటే ఒక కూతురిగానే కాకుండా.. ఒక తెలుగు వ్యక్తిగా చాలా గర్వంగా అనిపిస్తోంది. మా నాన్న గారు పోషించిన పౌరాణిక పాత్రలను తలుచుకుంటే.. తమ రూపాలను ప్రజలకు చూపించమని ఆ దేవుళ్లే ఆయన్ను ఆశీర్వదించి భూమిపైకి పంపారని అనిపిస్తుంది. ఒళ్లు పులకరిస్తుంది. అందుకే తెలుగు ప్రజలు ఎన్టీఆర్ గారిని కారణజన్ముడు అని చెబుతుంటారు అనుకుంట’’ అని నారా భువనేశ్వరి తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. మన దేశం(Mana Desam) మూవీ వజ్రోత్సవ వేళ ఎన్టీఆర్ అభిమానులు, తెలుగు వారందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు.

  Last Updated: 24 Nov 2024, 01:49 PM IST