Sakshi Ban: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని పలు చోట్ల కొన్ని వార్తా ఛానెళ్ల ప్రసారాలు నిలిచిపోయాయి. టీవీ9, ఎన్టీవీ, 10టీవీ, సాక్షి టీవీలను నిలిపి వేశారంటూ టీడీపీ, బీజేపీ, జనసేనలతో కూడిన ఎన్డీయే ప్రభుత్వపై ఆరోపణలు వచ్చాయి. ఈ నాలుగు ప్రాంతీయ వార్తా ఛానళ్లను ప్రభుత్వం అడ్డుకోవడంపై వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు ఎస్ నిరంజన్ రెడ్డి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)కి ఫిర్యాదు చేశారు.
రాష్ట్రంలో టీడీపీ నేతృత్వంలోని ప్రభుత్వం బలవంతం చేయడం వల్లే ఆంధ్రప్రదేశ్ కేబుల్ టీవీ ఆపరేటర్స్ అసోసియేషన్ ఈ నాలుగు ఛానెల్‌లను ప్రసారం చేయలేదని ఇటీవల TRAIకి రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం నుండి వచ్చిన ఒత్తిడి మరియు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ కేబుల్ టీవీ ఆపరేటర్స్ కొన్ని ఛానళ్లపై నిషేధం విధించినట్లు ఆరోపించారు నిరంజన్ రెడ్డి.
గోదావరి ప్రాంతానికి చెందిన స్థానిక కేబుల్ టీవీ సర్వీస్ ప్రొవైడర్ ఈ నాలుగు ఛానెల్‌లను బ్లాక్ చేసినట్లు ధృవీకరించారు. నాలుగు ఛానెల్‌లు బ్లాక్ చేసినట్లు మరియు ఈ నిర్ణయం నిర్వహణ స్థాయిలో తీసుకోబడిందని, మా పాత్ర లేదని చెప్పారు. గతంలో వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి మద్దతుగా నిలిచిన ఛానెల్‌లు ప్రసారాన్ని నిలిపివేశారు. TV5, ABN ఆంధ్రజ్యోతి మరియు ఈటీవీ మాత్రమే అక్కడ నడుస్తున్నాయట. టాటా ప్లే మరియు శాటిలైట్ టెలివిజన్ సర్వీస్ ప్రొవైడర్లు తప్ప మల్టీ-సిస్టమ్ ఆపరేటర్లు మరియు AP FibreNet ఈ ఛానెల్‌లను ప్రసారం చేయలేదని ఆపరేటర్ గుర్తించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయకముందే చానెళ్లు ఆగిపోయినట్లు 300 గృహాలకు సేవలందిస్తున్న ఆపరేటర్ గమనించారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2008లో సాక్షి వార్తాపత్రిక మరియు టెలివిజన్ ఛానెల్‌ని స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోని మొత్తం 175 స్థానాలకు గాను వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేవలం పదకొండు స్థానాల్లో విజయం సాధించి ఘోర పరాజయాన్ని చవిచూశారు.
Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం