Prudhvi Raj : శ్యామల కనపడితే కొడతారంటూ పృద్వి ఘాటైన వ్యాఖ్యలు

శ్యామల కనపడితే కొడతామని అక్కడి జనం అంటున్నారంటూ పృద్వి అన్నారు

Published By: HashtagU Telugu Desk
Prudvi Shayma

Prudvi Shayma

ఏపీలో ఎన్నికల ప్రచారం తారాస్థాయికి చేరింది..మరో ఐదు రోజుల్లో పోలింగ్ జరగనున్న క్రమంలో పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇదే క్రమంలో పలువురు సినీ , బుల్లితెర నటి నటులు తమ తమ అభిమాన అభ్యర్థుల కోసం ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా జనసేన కోసం పెద్ద ఎత్తున సినీ కళాకారులు దిగారు. పిఠాపురం, అనకాపల్లి , వైజాగ్ తదితర నియోజకవర్గాల్లో ప్రచారం చేసారు. అయితే వైసీపీ తరుపున ప్రచారం చేసిన యాంకర్ శ్యామల (Anchor Syamala) మాత్రం ఇప్పుడు వైరల్ గా మారింది. ముఖ్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , టిడిపి అధినేత చంద్రబాబు (Chandrababu) లపై ఆమె చేసిన కామెంట్స్ ఫై అభిమానులు , సినీ ప్రముఖులు , పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

హైదరాబాద్‌లో వుండే నీకు, ఏపీలో జరిగే విషయాలు తెలియవంటూ శ్యామలకు చురకలంటిస్తున్నారు. మరికొందరు శ్యామల భర్త నర్సింహారెడ్డిపై గతంలో నమోదైన చీటింగ్ కేసును, శ్యామల బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన వీడియోలను షేర్ చేస్తూ నువ్వు మాకు నీతులు చెప్పొద్దని కామెంట్ చేస్తున్నారు. తాజాగా జనసేన నేత 30 ఇయర్స్ పృద్వి (30 Years Prudhvi) సైతం శ్యామల ఫై ఘాటైన వ్యాఖ్యలు చేసారు.

విశాఖలో కాలినడకన తిరిగామని.. రెల్లి వీధి, మత్స్యకారులు నివసించే ఏరియాలు కాలుష్యంతో దుర్గంధపూరితంగా వున్నాయని .. ఆ ప్రాంతాల్లో అడుగుతీసి అడుగు పెట్టడం కూడా కష్టమేని.. అలాంటి ఏరియాల్లోకి వచ్చి విశాఖపట్నం చాలా సుందర ప్రాంతమని కామెంట్ చేసిందని శ్యామల కనపడితే కొడతామని అక్కడి జనం అంటున్నారంటూ పృద్వి అన్నారు. అవంతి శ్రీనివాస్ లాంటి వ్యక్తిని పక్కనపెట్టుకుని ఇలాంటి మాటలు మాట్లాడతారా.. ఆవిడకు ఇచ్చిన పేమెంట్‌లో విశాఖపట్నం గురించి ఎక్కువ చెప్పమని అన్నారెమోనంటూ పృథ్వీ ఆరోపించారు.

 

Read Also : Kadapa : వైఎస్ షర్మిలపై కేసు నమోదు చేసిన పోలీసులు

  Last Updated: 06 May 2024, 10:32 PM IST