AP Students In Kyrgyzstan: కిర్గిజ్‌స్థాన్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఈ క్రమంలోనే కిర్గిజ్‌స్థాన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 2,000 మంది విద్యార్థుల (AP Students In Kyrgyzstan) భద్రత కోసం విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ నరసింహారావు ఆదివారం సాయం కోరారు. సాయం కోరిన వెంటనే స్పందించిన జైశంకర్ సరైన చర్యలకు హామీ ఇచ్చారు.
బిజెపి సీనియర్ నాయకులు జీవీఎల్ నరసింహారావు ఆదివారం విదేశాంగ మంత్రి డా. ఎస్. జైశంకర్ ని సంప్రదించి, మధ్య ఆసియా దేశమైన కిర్గిజిస్తాన్‌లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైద్య విద్యార్థుల భద్రత కోసం జోక్యం చేసుకోవాలని కోరారు. కిర్గిజ్‌స్థాన్ రాజధాని నగరమైన బిష్‌కెక్‌లో భారతీయ విద్యార్థులతో సహా విదేశీ విద్యార్థులపై హింస, దాడుల గురించి వచ్చిన వార్తల నేపధ్యంలో ఆ విద్యార్థులు, వారి కుటుంబాలు తమ భద్రత కోసం భయపడుతున్న కారణంగా జీవీఎల్ ఈ చోరవ తీసుకోవటం జరిగింది.
Also Read: Salaar 2 : ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ఆగష్టులో అంటే.. సలార్ 2 ఇప్పటిలో లేనట్లేనా..?
కిర్గిజ్‌స్థాన్ రాజధాని బిష్‌కెక్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సుమారు 2,000 మంది విద్యార్థులు తమ వైద్య విద్యను అభ్యసిస్తున్నారని జీవీఎల్ నరసింహారావు మంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. “బిష్కెక్‌లోని భారత రాయబార కార్యాలయం ద్వారా అవసరమైన, తక్షణ చర్యలను ప్రారంభించమని అధికారులను ఆదేశించడం ద్వారా విద్యార్థులు సురక్షితంగా ఉండటానికి లేదా తిరిగి రావడానికి మీ జోక్యాన్ని అభ్యర్థించడానికి నేను వ్రాస్తున్నాను” అని జీవీఎల్ నరసింహారావు తన లేఖలో పేర్కొన్నారు. జీవీఎల్ నరసింహారావు అభ్యర్థనపై వెంటనే స్పందించిన ఎస్. జైశంకర్ కిర్గిజ్‌స్థాన్ లోని భారతీయ విద్యార్థులకు భద్రత కల్పించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. త్వరితగతిన స్పందించి సకాలంలో జోక్యం చేసుకున్నందుకు విదేశాంగ మంత్రికి జీవీఎల్ నరసింహారావు కృతజ్ఞతలు తెలిపారు.
We’re now on WhatsApp : Click to Join
తెలుగు విద్యార్థులందరూ క్షేమం
కిర్గిస్థాన్‌లోని బిష్‌కెక్‌లో ఉన్న తెలుగు విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్‌ఆర్‌టీఎస్) అధ్యక్షుడు మేడపాటి ఎస్ వెంకట్ భరోసా ఇచ్చారు. వెంకట్ TNIEతో మాట్లాడుతూ.. శనివారం APNRTS కిర్గిజ్‌స్థాన్‌లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులను సంప్రదించి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. “భారత విద్యార్థులపై హింసకు సంబంధించిన నివేదికలు లేవు. విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యార్థులను హాస్టల్‌లో ఉండమని ఆదేశించాయి. సోమవారం నుండి ఆన్‌లైన్ తరగతులు నిర్వహించేలా చూసుకున్నాయి” అని తెలిపారు.