నక్కపల్లి మండలంలో జాతీయ రహదారిపై గోమాంసాన్ని (Beef ) అక్రమంగా తరలిస్తున్న కంటైనర్(Container)ను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం 5000 కిలోల గోమాంసాన్ని పోలీసులు (Police) సీజ్ చేశారు. దాని విలువ సుమారు 15 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. విజయనగరం (Vizianagaram) సమీపంలోని సంతపాలెం నుండి రాజమండ్రికి గోమాంసాన్ని తరలిస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు వేంపాడు టోల్ ప్లాజా వద్ద వాహనాన్ని ఆపి తనిఖీ చేసి చేయగా గోమాసం బయటపడింది. నక్కపల్లి సీఐ కుమారస్వామి నేతృత్వంలో ఎస్సై సన్నీబాబు, సిబ్బంది ఈ తనిఖీలో పాల్గొన్నారు. డ్రైవర్ మణికంఠను విచారించగా ఐదుగురు వ్యక్తులు కలిసి ఈ రవాణా ఏర్పాటు చేసినట్లు తెలిపాడు. ఈ గోమాంసాన్ని రహస్యంగా మరొక ప్రాంతానికి తరలించడానికి యత్నించారని, కాని ముందస్తు సమాచారం కారణంగా దీనిని అడ్డుకున్నామని పోలీసులు పేర్కొన్నారు.
సీబీఐ నివేదిక ప్రకారం.. గోమాంసాన్ని ఎక్కడ నిల్వ చేయాలో స్థానిక రెవెన్యూ అధికారుల సమక్షంలో నిర్ణయించారు. సీజ్ చేసిన 5000 కిలోల గోమాంసాన్ని వేంపాడు వద్ద ఎంఆర్ఓ ఆఫీస్ సమీపంలోని చెరువు వద్ద పాతిపెట్టారు. డ్రైవర్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఐదుగురు వ్యక్తులను గుర్తించామని, వారిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ కుమారస్వామి తెలిపారు. గోమాంసాన్ని ఎవరు కొనుగోలు చేసారు, ఎక్కడికి తరలిస్తున్నారు, దీనికి సంబంధించిన మొత్తం రవాణా వ్యవస్థపై సవివరమైన విచారణ జరుపుతున్నామని మీడియా కు తెలిపారు. గోమాంసం అక్రమ రవాణా వ్యవహారంపై పూర్తిగా దృష్టి పెట్టామని, ఈ ఘటనలో ప్రధాన నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు స్పష్టం చేశారు.
Read Also : E Car Race Case : కేటీఆర్ కు ఊరట