Site icon HashtagU Telugu

Chandrababu: 14 ఏళ్ళ ముఖ్యమంత్రికి 14 రోజుల రిమాండ్.. దేవుడి స్క్రిప్ట్..!

Chandrababu

New Web Story Copy 2023 09 11t133307.672

Chandrababu: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు(Chandrababu) అరెస్టుపై రాష్ట్రంలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేసినందుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ సోమవారం ఆంధ్రప్రదేశ్ బంద్‌కు పిలుపునిచ్చింది. ఆయన అరెస్టుపై విపక్ష నేతలు కూడా స్పందించారు. అరెస్ట్‌పై పలువురు నేతలు జగన్ సర్కార్‌ను టార్గెట్ చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌కు సంబంధించి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు . 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఈ కుంభకోణానికి పాల్పడ్డారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో శనివారం అరెస్టయిన చంద్రబాబు నాయుడును 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు. దీంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. ఆయన అరెస్ట్ రాష్ట్రంలో రాజకీయంగా సంచలనం సృష్టించింది. నిరసనగా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ బంద్‌కు పిలుపునిచ్చింది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా బంద్‌కు మద్దతు ప్రకటించారు. ఇదిలా ఉండగా చంద్రబాబుకి 14 రోజుల రిమాండ్ విధించడంపై ఓ ఆసక్తికర చర్చ నడుస్తుంది.

చంద్రబాబు తన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఒక్కసారి కూడా కోర్టు మెట్లు ఎక్కలేదు. 14 ఏళ్లు ఆయన ముఖ్యమంత్రిగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​కు 9 ఏళ్లు కాగా నవ్యాంధ్రకు 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. దేశరాజకీయాల్లో చక్రం తిప్పి ప్రధానిని సైతం డిసైడ్ చేసిన ఘనత ఆయన సొంతం. 40 ఏళ్ళ సీనియారిటీలో ఎంతో మంది తలపండిన నేతలతో కలిసి పని చేశాడు. కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారుతున్న క్రమంలో టీడీపీలోకి వచ్చి ఇప్పుడు ఆ పార్టీకి అధినేతగా కొనసాగుతున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే చంద్రబాబుపై అనేక కేసులు నమోదయ్యాయి. చాలా కేసుల్లో ఆయన పలుకుబడి ఉపయోగించి స్టే తెచ్చుకున్నారు.

స్కిల్ డెవలప్​మెంట్ కేసులో (skill development scam) ఆయన తొలిసారి కోర్టుకు వెళ్లారు. వాదోపవాదనలు విన్న న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. 14 సంవత్సరాల ముఖ్యమంత్రికి 14 రోజుల రిమాండ్ విధంచడం కూడా దేవుడు రాసిన స్క్రిప్ట్ గా భావిస్తుంది ఓ వర్గం. సోషల్ మీడియా వేదికగా 14 ఇయర్స్ సీఎం కి 14 డేస్ జైలు జీవితమని ఆసక్తికర చర్చ మొదలైంది. విశేషమేంటంటే 2014 ఎన్నికల్లో చంద్రబాబు వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను లాక్కున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించగా చంద్రబాబుకి కేవలం అదే 23 సీట్లు దక్కాయి. ఇదంతా దేవుడి స్క్రిప్టేనని సోషల్ మీడియాలో నెటిజన్స్ పోస్ట్స్ పెడుతున్నారు.

Also Read: Chandrababu Arrest : చంద్రబాబును జైలుకు పంపించడం వైసీపీ కి ప్లస్సా..? మైనస్సా..?