టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కి కడప జిల్లా న్యాయమూర్తి 14 రోజులపాటు రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను పోలీసులు కడప జైలుకు తరలించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) యువగళం (Yuvagalam) పాదయాత్ర ప్రారంభించడానికి రెండు రోజుల ముందు జనవరి 25న కడపలోని దేవుని కడప ఆలయం, పెద్ద దర్గా సందర్శనకు వచ్చారు.
ఈ సందర్భంగా లోకేశ్‌కు స్వాగతం పలకడానికి పెద్దసంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బీటెక్ రవి కడప విమానాశ్రయం (Kadapa Airport) మెయిన్ గేట్ వద్దకు చేరుకున్నారు. ఎయిర్ పోర్టులోకి ప్రవేశించడానికి ట్రై చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు – రవికి మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. దాదాపు పది నెలల తర్వాత వల్లూరు పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి, ఆయన్ను అదుపులోకి తీసుకొని కోర్ట్ లో హాజరు పరిచారు.
We’re now on WhatsApp. Click to Join.
మొదట రవి రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి వెనక్కి పంపించారు. ఈరోజు కడప కోర్టులో ప్రవేశ పెట్టాలని ఆదేశించారు. 10 నెలల క్రితం ఘటన జరిగితే ఇంత వరకు ఏం చేశారని పోలీసులను న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే రవిపై కడప విమానాశ్రయం వద్ద ఆందోళన కేసుతోపాటు టికెట్ బెట్టింగ్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో రవికి 41ఏ నోటీసులు ఇచ్చినట్లుగా తెలిపారు. బెట్టింగ్ కేసును ఇప్పటికిప్పుడు నమోదు చేశారని అటు రవి తరపు న్యాయవాదులు వాధించారు. ఇరు పక్షాల వాదానలు విన్న న్యాయమూర్తి రవికి రిమాండ్ (14 Days Remand) విధించారు. దీంతో ఆయన్ను కడప జైలు (Kadapa Jail)కు తరలించారు.
Read Also : Rain Alert Today : బంగాళాఖాతంలో వాయుగుండం.. ఏపీలోని ఈ ప్రాంతాలపై ఎఫెక్ట్