ఏపీలో తొలి దశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు

EV Charging Stations  ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వాడకాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వ ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. తొలి దశలో 135 ఈవీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేంద్రాల్లో 600 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది. దీంతో జాతీయ రహదారుల వెంబడి ప్రయాణించే ఈవీ వాహనదారులకు ఇకపై ఛార్జింగ్ కష్టాలు తీరనున్నాయి. ఆంధ్రప్రదేశ్ […]

Published By: HashtagU Telugu Desk
Ap Ev Charging Stations

Ap Ev Charging Stations

EV Charging Stations  ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వాడకాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వ ‘పీఎం ఈ-డ్రైవ్’ పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భారీగా ఛార్జింగ్ నెట్‌వర్క్‌ను విస్తరించనుంది. తొలి దశలో 135 ఈవీ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ కేంద్రాల్లో 600 ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయనుంది. దీంతో జాతీయ రహదారుల వెంబడి ప్రయాణించే ఈవీ వాహనదారులకు ఇకపై ఛార్జింగ్ కష్టాలు తీరనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో 444 ఈవీ కేంద్రాలను ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్ర బృందం.. తొలి విడతలో 135 ప్రాంతాల్లో ఈవీ కేంద్రాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపల్ కార్పొరేషన్లు, జెన్కో మరియు డిస్కంల ఖాళీ స్థలాల్లో వీటిని నిర్మిస్తారు. కార్లు, ద్విచక్ర వాహనాలు, ఆటోలతో పాటు భారీ వాహనాలకు కూడా ఇక్కడ ఛార్జింగ్ సదుపాయం ఉంటుంది.

ఏప్రిల్‌లో టెండర్లు.. ఆగస్టుకల్లా పూర్తి!
ఏప్రిల్‌లో టెండర్ల ప్రక్రియను ప్రారంభించి జులై లేదా ఆగస్టు నాటికే ఈ కేంద్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని నెడ్‌క్యాప్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒక్కో కేంద్రానికి సుమారు రూ.50 లక్షలు ఖర్చవుతుందని అంచనా. ఇందులో 80% కేంద్రం భరిస్తుండగా, మిగిలిన 20% వాటాను డిస్కంలు సమకూరుస్తాయి. ఐదేళ్ల పాటు ఆపరేటర్లు వీటిని నిర్వహిస్తారు. దీని ద్వారా వచ్చే ఆదాయం ప్రధానంగా డిస్కంలకే చెందుతుంది.

రెండో దశలో నగరాలపై ఫోకస్
ఏటా రాష్ట్రంలో 6 వేల ఈవీ కార్లు, 40 వేల టూవీలర్లు కొత్తగా రోడ్డెక్కుతున్నాయి. ఈ జోరును గమనించిన అధికారులు, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ‘ఛార్జింగ్ నెట్‌వర్క్’ను సిద్ధం చేస్తున్నారు. హైవేల తర్వాత, నగరాల్లో ఛార్జింగ్ సదుపాయాలను పెంచడంపై దృష్టి సారించారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కాకినాడ, ఏలూరు నగరాల్లో రెండో దశలో మరో 100 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

  Last Updated: 10 Mar 2026, 12:57 PM IST