అల్ప పీడనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో (AP & Telangana) రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా విజయవాడ లో వర్షం పడడం తో నగరంలో సగంపైగా కాలనీ లు నీట మునిగాయి. వర్షాల కారణంగా విజయవాడ (vijayawada) డివిజన్‌లో చాలా చోట్ రైల్వే ట్రాక్స్ పూర్తి దెబ్బ తిన్నాయి. దీంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆయా ప్రాంతాలకు రైళ్ల ప్రయాణాలు సాగలేని పరిస్థితి నెలకొంది. దీంతో విజయవాడ మీదుగా వెళ్లే 132 రైళ్లను అధికారులు రద్దు చేశారు. 93 రైళ్లను దారి మళ్లించారు. కొండపల్లి, రాయనపాడులో పట్టాలపై నీరు చేరడంతో మూడు రైళ్లు అక్కడే ఆగిపోయాయి. 40 ప్రత్యేక బస్సుల్లో 2 వేల మందిని విజయవాడ స్టేషన్ కు తరలించారు. ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఎన్టీఆర్ జిల్లా అధికారులు అల్పాహారం, భోజన ఏర్పాట్లు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక రైళ్ల రద్దుతో విజయవాడ సహా చాలా స్టేషన్లలో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వారికి ఎలా ప్రయాణించాలో అర్థం కావట్లేదు. ప్రత్యామ్నాయ ప్రయాణ అవకాశాలు కూడా సరిగా లేవు. జిల్లాల్లో వరదలతో బస్సులు కూడా సరిగా వెళ్లే పరిస్థితి లేదు. వాగులు, వంకలూ ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో.. ఊళ్ల మధ్య లింక్ తెగిపోతోంది. రోడ్లు కనిపించట్లేదు. ఉధ్ధృత ప్రవాహాలతో వాహనాలు కొట్టుకుపోయే ప్రమాదం కనిపిస్తోంది. ఐతే.. విజయవాడ-హైదరాబాద్ రాకపోకలకు సంబంధించి.. నిన్న బెజవాడ దగ్గర మూసేసిన రోడ్డు మార్గాన్ని ఇవాళ మళ్లీ ఓపెన్ చేశారు. అందువల్ల రోడ్డు మార్గం కొంతవరకూ అనుకూలంగా ఉందనుకోవచ్చు.
విజయవాడ వైపు రద్దైన రైళ్ల వివరాలు..
విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్.
హైదరాబాద్ షాలిమార్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్.
సికింద్రాబాద్ హౌరా పలకనామ ఎక్స్‌ప్రెస్.
మహబూబ్‌నగర్ ఎక్స్‌ప్రెస్.
విశాఖపట్నం హైదరాబాద్ గోదావరి ఎక్స్‌ప్రెస్.
విశాఖపట్నం సికింద్రాబాద్ గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్.
విశాఖపట్నం లోకమాన్య టెర్మినల్ ఎక్స్‌ప్రెస్.
హైదరాబాదు నుండి విశాఖపట్నం రావాల్సిన మూడు ట్రైన్లు రద్దు.
ఏపీ ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు.
బెంగళూరు భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూల్ చేశారు.
విశాఖ ఎక్స్‌ప్రెస్ రీ షెడ్యూల్ చేశారు.
తెలంగాణ లో రద్దైన రైళ్ల వివరాలు చూస్తే..
12713 విజయవాడ-సికింద్రాబాద్ (శాతవాహన)
12714 సికింద్రాబాద్-విజయవాడ (శాతవాహన)
17233 సికింద్రాబాద్-సిర్పూర్‌కాగజ్‌నగర్ (భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్)
12706 సికింద్రాబాద్-గుంటూరు (ఇంటర్‌సిటీ)
12705 గుంటూరు-సికింద్రాబాద్ (ఇంటర్ సిటీ)
17202 సికింద్రాబాద్-గుంటూరు (గోల్కొండ ఎక్స్‌ప్రెస్)
17201 గుంటూరు సికింద్రాబాద్ గోల్కొండ ఎక్స్‌ప్రెస్)
20708 విశాఖపట్నం-సికింద్రాబాద్ (వందేభారత్)
12762 కరీంనగర్-తిరుపతి (సూపర్‌ఫాస్ట్)
12704 సికింద్రాబాద్-హౌవ్‌డా (ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్)
12703 హౌవ్‌డా-సికింద్రాబాద్ (ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్)
17230 సికింద్రాబాద్-తిరువనంతపురం (శబరి ఎక్స్‌ప్రెస్)
17229 తిరువనంతపురం-సికింద్రాబాద్ (శబరి ఎక్స్‌ప్రెస్)
12862 మహబూబ్‌నగర్-విశాఖపట్నం (సూపర్‌ఫాస్ట్)
17058 లింగంపల్లి-ముంబయి (దేవనగరి ఎక్స్‌ప్రెస్)
17057 ముంబయి- లింగంపల్లి (దేవనగరి ఎక్స్‌ప్రెస్)
Read Also : Ponnam : ఏదైనా సమాచారం..సహాయం కొరకు ప్రజలకు టోల్ ఫ్రీ నెంబర్: మంత్రి పొన్నం