Site icon HashtagU Telugu

AP Volunteers: వైసీపీకి ఈసీ బిగ్ షాక్, తిరుపతిలో 11 మంది వాలంటీర్ల తొలగింపు

AP Volunteers

AP Volunteers

AP Volunteers: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోకసభ ఎన్నికలు ఏకకాలంలో జరగనున్నాయి. ఇందుకోసం ఆయా రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఎలక్షన్ కోడ్ అమలైంది. దీంతో ఎన్నికల ప్రచారాలు ఊపందుకున్నాయి.

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగుతుండగా వైసీపీ ఒంటరి పోరుకు సిద్ధమైంది. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాలంటీర్ వ్యవస్థను తాత్కాలికంగా నిలిపివేయాలని ఎన్నికల సంఘం ప్రభుత్వానికి సూచించింది. అంటే లబ్దిదారులకు వాలంటీర్ల ద్వారా పథకాలను చేరువేయకుండా, ఇతర పద్ధతుల్ని అవలంబించాలని ఈసీ ఆదేశించింది. అయితే నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మొదటి నుంచి హెచ్చరిస్తూ వస్తున్న ఈసీ, తాజాగా తిరుపతిలో 11 మంది వాలంటీర్లను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో వైసీపీ ప్రభుత్వానికి గట్టి షాక్ ఇచ్చినట్లయింది.

We’re now on WhatsApp : Click to Join

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వాలంటీర్లపై ఎన్నికల అధికారులు వేటు వేశారు . ఇప్పటికే చాలా మంది వాలంటీర్లు విధులకు గైర్హాజరవగా తాజాగా మరో 11 మందిని విధుల నుంచి తొలగించారు. తిరుపతి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు వారిని విధుల నుంచి తొలగించినట్లు కలెక్టర్ జి.లక్ష్మి తెలిపారు. సస్పెండ్ అయిన వారిలో ఏర్పేడు మండలానికి చెందిన నలుగురు, నారాయణవనం మండలానికి చెందిన ముగ్గురు, రేణిగుంట, పుత్తూరుకు చెందిన ఒక్కొక్కరు, బీఎన్ కండ్రిగకు చెందిన ఇద్దరు ఉన్నారు.

Also Read: Rs 3500 Crore : కాంగ్రెస్‌కు భారీ ఊరట.. ఇబ్బంది పెట్టబోమన్న ఐటీ శాఖ