Zero Tariffs: ప్రపంచంలోని రెండో అతిపెద్ద వినియోగదారుల మార్కెట్ అయిన చైనాలో తమ వాటాను పెంచుకోవడానికి ఆఫ్రికా దేశాలకు ఇది ఒక సువర్ణావకాశం. ఈ నిర్ణయం ప్రకారం.. ఆయా దేశాల నుండి వచ్చే వ్యవసాయ, మైనింగ్ లేదా పారిశ్రామిక ఉత్పత్తులు ఇలా దాదాపు అన్ని రకాల వస్తువులు ఇకపై ఎటువంటి దిగుమతి సుంకం లేకుండానే చైనాలోకి ప్రవేశించవచ్చు.
ఒక దేశానికి మాత్రం నో ఎంట్రీ!
అయితే ఈ భారీ రాయితీ జాబితా నుండి ఒక ఆఫ్రికా దేశాన్ని మాత్రం చైనా మినహాయించింది. ఎస్వాటిని దేశానికి ఈ ప్లాన్ వర్తించదు. దీనికి కారణం ఆ దేశానికి తైవాన్‌తో దౌత్య సంబంధాలు ఉండటమే. చైనా మొదటి నుండి ‘వన్ చైనా పాలసీ’ని అనుసరిస్తూ తైవాన్‌ను తనలో భాగంగానే భావిస్తుంది. అందుకే తైవాన్‌తో అధికారిక సంబంధాలు కొనసాగించే దేశాలను ఇటువంటి ఆర్థిక ప్రయోజనాలకు దూరంగా ఉంచుతుంది.
వ్యూహాత్మక అడుగు
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చైనా తీసుకున్న ఈ నిర్ణయం కేవలం వ్యాపారపరమైనదే కాదు, వ్యూహాత్మకమైనది కూడా. ఆఫ్రికాలో ఇప్పటికే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, పెట్టుబడులు, సహజ వనరుల వేటలో చైనా తన ప్రభావాన్ని పెంచుకుంటోంది. ఇప్పుడు టారిఫ్‌ల రద్దుతో ఆఫ్రికా దేశాలు చైనా వైపు మరింతగా మొగ్గు చూపే అవకాశం ఉంది.
Also Read: మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం.. భారీ తీర్మానానికి అడ్డుపడిన వీటో పవర్!
చైనా-ఆఫ్రికా వాణిజ్యంపై ప్రభావం
ఈ నిర్ణయం వల్ల ఇరుపక్షాలకు ప్రయోజనం చేకూరనుంది.
ఆఫ్రికా దేశాలకు: చైనాకు ఎగుమతులు చేయడం చౌకగా మారుతుంది. తద్వారా వారి ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది.
చైనాకు: ఆఫ్రికా నుండి తక్కువ ధరకే ముడి సరుకులు, వనరులు సులభంగా లభిస్తాయి. ప్రపంచ వేదికపై అమెరికా వంటి దేశాలు టారిఫ్‌ల విషయంలో కఠిన వైఖరి అవలంబిస్తుంటే చైనా మాత్రం తాము ‘స్వేచ్ఛా వాణిజ్యానికి, సహకారానికి’ సిద్ధమని చాటిచెప్పే ప్రయత్నం చేస్తోంది.
