Magicians in Soviet Army: సోవియట్ సైన్యంలో మెజీషియన్స్.. ఏం చేసేవారో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఒకప్పుడు రష్యా నేతృత్వంలో పనిచేసిన సోవియట్ యూనియన్ సైన్యం యొక్క మరో ప్రత్యేకత వెలుగులోకి వచ్చింది.అందులో ఇంద్రజాలికుల ప్రత్యేక టీమ్ కూడా ఉండేదని వెల్లడైంది.

ఒకప్పుడు రష్యా నేతృత్వంలో పనిచేసిన సోవియట్ యూనియన్ సైన్యం యొక్క మరో ప్రత్యేకత వెలుగులోకి వచ్చింది. అందులో ఇంద్రజాలికుల (Magicians) ప్రత్యేక టీమ్ కూడా ఉండేదని వెల్లడైంది.’సైకలాజికల్ రెజిమెంట్’ అనే పేరు కలిగిన ఆ విభాగాన్ని చాలా సీక్రెట్ గా ఉంచారని అంటున్నారు. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అమెరికా సైన్యాన్ని ఎదుర్కొనేందుకు సైకలాజికల్ రెజిమెంట్ ను ఏర్పాటు చేశారని చెబుతున్నారు. ఇలాంటి విషయాల్లో అమెరికన్ సైన్యం కూడా ఆరితేరిందని.. అది కూడా అప్పట్లో స్టార్‌గేట్ ప్రాజెక్ట్‌ను నిర్వహించింది.

సైనిక యూనిట్ 10,003..

1980వ దశకం చివరలో సోవియట్ యూనియన్‌లోని ఉన్నత స్థాయి సైనిక వర్గాల్లో జ్యోతిష్యం మరియు ఆధ్యాత్మికతపై ఆసక్తి ఉన్న చాలా మంది వ్యక్తులు ఉన్నారు. వాళ్లంతా కలిసి శక్తివంతమైన ఇంద్రజాలికులు (Magicians), మానసిక నిపుణుల టీమ్ ను నియమించారు.సైనిక ప్రత్యర్థులపై మానసిక ఒత్తిడిని సృష్టించేందుకు ఈ టీమ్ ను వాడేవారు.ఈవిధంగా మిలిటరీ యూనిట్ నంబర్ 10003 ఏర్పడింది. దీనికి కల్నల్ అలెక్సీ సవిన్‌ను కమాండర్‌గా నియమించారు. అతను అసాధారణమైన సామర్థ్యాలు కలిగిన వ్యక్తి అని, అతీంద్రియ సంఘటనలను విశ్వసించేవాడని అంటారు. ఈ టీమ్ లోని వాళ్ళు కాంతి వేగం కంటే వేగంగా శక్తిని బదిలీ చేయగల జనరేటర్లను అభివృద్ధి చేశారు. అరుదైన ప్రాంతంలో పని చేయడానికి వీరిని ఉపయోగించారు. పగిలిన గాజులు మరియు వేడి బొగ్గులపై నడిచినా నొప్పి తెలియని రేంజ్ లో వీరికి కఠిన సైనిక శిక్షణ ఇచ్చారట.
మొదటి చెచెన్ యుద్ధంలో మనస్తత్వవేత్తలు రష్యన్ సైనికులకు చాలా సహాయం చేశారు.నిజానికి సోవియట్ ఆర్మీ రహస్య విభాగం గురించిన సమాచారం మీడియాలో లీక్ అయింది. రహస్యాలన్నీ బయటపడ్డాయి. ప్రత్యర్థులు అలర్ట్ అయ్యారు. అందుకే మాయా విభాగాన్ని మూసేయాల్సి వచ్చింది. అయినప్పటికీ, అమెరికన్ స్టార్‌గేట్ ప్రాజెక్ట్ మూసివేయబడే వరకు మిలిటరీ యూనిట్ 10003 పని చేస్తూనే ఉంది. కానీ తరువాత రష్యాలో ఇది అశాస్త్రీయ సైనిక యూనిట్ గా పరిగణించబడింది.దీంతో మొత్తం విభాగం రద్దు చేయబడింది.

1991 డిసెంబర్ 25న సోవియట్ యూనియన్ అంతం:

  1. అమెరికా, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దేశం. కానీ దశాబ్దాల కాలం పాటు సోవియట్ యూనియన్ , అమెరికాకు సవాలుగా నిలిచింది. అయితే, 1991 డిసెంబర్ 25న ఆ దేశం ఉనికి కోల్పోయింది. ప్రపంచ పటం నుంచి నిష్క్రమించింది.
  2. ఆరోజు, క్రెమ్లిన్ నుంచి సోవియట్ యూనియట్ అధ్యక్షుడు మిఖాయిల్ గోర్బచేవ్ జాతినుద్దేశించి ప్రసంగించారు. ”సోవియట్ యూనియన్ అధ్యక్షుడిగా నా పనిని ముగిస్తున్నాను” అని పేర్కొన్నారు.
  3. యావత్ ప్రపంచం ఆయన ప్రసంగాన్ని ఆలకించింది. చాలా మందికి, అప్పటితో ప్రచ్ఛన్న యుద్ధం, కమ్యూనిస్టు శక్తి అంతరించినట్లు అనిపించింది. మరోవైపు, కొందరు మాత్రం ‘బెలావెజా’ ఒప్పందానికి వారాల ముందే సోవియట్ యూనియన్ ఉనికి కోల్పోయిందని నమ్ముతారు.
  4. అదే ఏడాది ఆగస్టులో జరిగిన తిరుగుబాటు ప్రయత్నం తర్వాత సోవియట్ యూనియన్‌కు మరికొన్ని రోజులు మిగిలి ఉన్నాయని పెద్ద సంఖ్యలో ప్రజలు అర్థం చేసుకున్నారు.
  5. సమాఖ్య ప్రభుత్వంలోని మిత్ర దేశాలతో గోర్బచేవ్ కొంత కాలంగా చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో మరింత సులభమైన యూనియన్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. సోవియట్ యూనియన్‌ను కాపాడుకోవడానికి ఇదే చివరి మార్గమని గోర్బచేవ్ నమ్మారు.

Also Read:  Nityananda: మైక్రో నేషన్స్ కలకలం: నిత్యానంద కైలాస దేశం నుంచి రజనీష్‌పురం దాకా..