World War III : అదే జరిగితే.. మూడో ప్రపంచ యుద్ధం : జెలెన్స్కీ

World War III : ఈ మధ్యకాలంలో మూడో ప్రపంచ యుద్ధం భయాలు పెరిగాయి.

Published By: HashtagU Telugu Desk
Zelensky

Ukraine President Zelensky

World War III : ఈ మధ్యకాలంలో మూడో ప్రపంచ యుద్ధం భయాలు పెరిగాయి. దీనిపై డిస్కషన్ కూడా పెరిగింది. తాజాగా ఈ అంశంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సైతం కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యా చిన్న పొరపాటు చేసినా వరల్డ్ వార్ 3 మొదలయ్యే రిస్క్ ఉందన్నారు. జర్మనీ నుంచి అమెరికా దాకా చాలా దేశాల మద్దతును కూడగట్టడంలో తమ దేశం సక్సెస్ అయిందని జెలెన్స్కీ చెప్పారు. ఈ యుద్ధంలో ఒకవేళ ఏదైనా నాటోదేశంతో తలపడేందుకు రష్యా యత్నిస్తే.. అది మూడో ప్రపంచ యుద్ధానికి(World War III) దారి తీయొచ్చని కామెంట్ చేశారు. ప్రస్తుతం జెలెన్స్కీ జర్మనీ పర్యటనలో ఉన్నారు. ఈసందర్భంగా జర్మనీ ప్రభుత్వ టీవీ ఛానల్ ARDకి ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు.  ఉక్రెయిన్ వివాదం మూడో ప్రపంచ యుద్ధంగా మారే ముప్పు లేకపోలేదన్నారు.  ఈవిషయం బహుశా జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌కు ఇప్పటికే అర్ధమై ఉంటుందని కామెంట్ చేశారు. నాటో దేశాలను ఢీకొనే సాహసాన్ని రష్యా చేస్తే.. అదే మూడో ప్రపంచ యుద్ధానికి నాంది అవుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

టారస్ క్రూయిజ్ క్షిపణులను ఉక్రెయిన్‌కు సప్లై చేయలేమని ఇటీవల జర్మనీ ప్రకటించింది. దీనిపై జెలెన్స్కీ మాట్లాడుతూ.. ‘‘టారస్ క్షిపణులను జర్మనీ సప్లై చేయనందుకు నేను నిరాశ చెందడం లేదు. రష్యా  దండయాత్రను ప్రారంభించిన కొత్తలో జర్మనీ  మాతో నిలవనందుకు మాత్రమే నేను నిరాశచెందాను’’ అని చెప్పారు. ‘‘2014లో ఉక్రెయిన్‌లోని క్రిమియాను రష్యా ఆక్రమించుకున్నప్పుడే పశ్చిమ దేశాలు వచ్చి అడ్డుకొని ఉంటే పరిస్థితి మరోలా ఉండి ఉండేది. 2022 ఫిబ్రవరిలో మరోసారి రష్యా దండయాత్ర చేసే సాహసానికి ఒడిగట్టి ఉండేది కాదు’’ అని ఆయన తెలిపారు. ఉక్రెయిన్‌కు మద్దతు ప్రకటించే అంశంపై  అమెరికా, జర్మనీ సహా చాలా దేశాల్లో  రాజకీయ విభజన ఉన్న విషయం వాస్తవమేనని అంగీకరించారు.

Also Read :WhatsApp Chat Transfer : బ్యాకప్‌ అక్కర్లేదు.. పాత ఫోన్ నుంచి కొత్త ఫోనుకు ఛాట్ ట్రాన్స్‌ఫర్

అది ఉక్రెయిన్ చేసిన నేరమే :  పుతిన్

తమ సైనిక రవాణా విమానాన్ని ఉక్రెయిన్‌ బలగాలే కూల్చివేశాయని రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అన్నారు. ‘వారు పొరపాటున ఆ విమానాన్ని కూల్చివేశారా..? లేక ఉద్దేశపూర్వకంగా ఆ పని చేశారా..? అని నాకు తెలీదు. ఏదేమైనా వారి బలగాల చేతిలో ఆ విమానం కూలిపోయింది. జరిగింది మాత్రం ఓ నేరం’ అని విమానం కూల్చివేత అనంతరం పుతిన్‌ మొదటిసారి టీవీ ప్రసంగంలో స్పందించారు. రష్యా సైనిక రవాణా విమానం ఒకటి ఉక్రెయిన్‌ సరిహద్దులో కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 74 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 65 మంది ఉక్రెయిన్‌ యుద్ధ ఖైదీలు, ఆరుగురు విమాన సిబ్బంది, ముగ్గురు సహాయకులు(ఎస్కార్ట్‌) ఉన్నారు. ఉక్రెయిన్‌ సమీపంలోని బెల్గోరాడ్‌లో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ప్రమాదానికి ఉక్రెయిన్‌ కారణమని ఆరోపించింది.

  Last Updated: 29 Jan 2024, 07:53 AM IST