HIV AIDS : 2023లో ఎయిడ్స్‌కు 6.30 లక్షల మంది బలి : యూఎన్

ఎయిడ్స్ మహమ్మారి దడ పుట్టిస్తోంది. గత సంవత్సరం ఎయిడ్స్‌తో దాదాపు 6.30 లక్షల మంది చనిపోయారు. 

  • Written By:
  • Publish Date - July 23, 2024 / 12:08 PM IST

HIV AIDS : ఎయిడ్స్ మహమ్మారి దడ పుట్టిస్తోంది. గత సంవత్సరం ఎయిడ్స్‌తో దాదాపు 6.30 లక్షల మంది చనిపోయారు.  దాదాపు 4 కోట్ల మంది ఎయిడ్స్‌తో బాధపడుతున్నారు. వీరిలో దాదాపు 90 లక్షల మంది తగిన చికిత్సను పొందలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇందువల్లే ప్రతి నిమిషానికి ఒక ఎయిడ్స్ రోగి చనిపోతున్నారు. ఈమేరకు వివరాలతో ఐక్యరాజ్యసమితి(యూఎన్) తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది.

We’re now on WhatsApp. Click to Join

యూఎన్ నివేదికలోని వివరాలివీ.. 

  • 2004లో 21 లక్షల మంది ఎయిడ్స్‌తో(HIV AIDS) చనిపోయారు. 2023లో దాదాపు 6.30 లక్షల మంది ఎయిడ్స్‌తో ప్రాణాలు విడిచారు.
  • 2023 సంవత్సరం నాటికి ప్రపంచవ్యాప్తంగా హెచ్‌ఐవీ‌తో బాధపడుతున్న 3.99 కోట్ల మందిలో 86 శాతం మందికే తమకు ఎయిడ్స్ ప్రబలిందని తెలుసు. వారిలో 77 శాతం మంది చికిత్సపొందుతున్నారు. చికిత్స పొందిన వారిలో దాదాపు 72 శాతం మందిలో హెచ్‌ఐవీ వైరస్ నిర్వీర్యం అయింది.
  • సెక్స్ వర్కర్లు, హిజ్రాలు, డ్రగ్స్ తీసుకునే వారిలో కొత్త ఎయిడ్స్ ఇన్ఫెక్షన్స్ కేసులు 45 శాతం నుంచి 55 శాతానికి పెరిగాయి.

Also Read :Budget 2024-25 : ఆర్థికమంత్రికి పెరుగు, చక్కెర తినిపించిన రాష్ట్రపతి ముర్ము

  • ఎయిడ్స్ ప్రభావంతో మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికా, తూర్పు ఐరోపా, సెంట్రల్ ఆసియా, లాటిన్ అమెరికాలలోని పలు దేశాల్లో కొత్త అంటువ్యాధులు ప్రబలుతున్నాయి.
  • ఆఫ్రికాలోని కొన్ని ప్రాంతాలలో కౌమారదశలో ఉన్న బాలికలు,యువతులకు కూడా అత్యధిక హెచ్‌ఐవీ ముప్పు పొంచి ఉంటోంది.
  • వివిధ వ్యాక్సిన్ కంపెనీలు హెచ్‌ఐవీ ఇంజెక్షన్ల డెవలప్మెంట్ ప్రక్రియలో నిమగ్నమై ఉన్నాయి. ఆ ఇంజెక్షన్లు అందుబాటులోకి వచ్చాక.. రోగులు తీసుకుంటే ఆరునెలల పాటు శరీరంలో యాక్టివ్‌గా ఉండి పనిచేస్తుంటాయి. అయితే రెండు డోసులకు ఏటా దాదాపు రూ.33 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది.
  • పేద, మధ్యతరగతి దేశాలకు తక్కువ రేటుకే హెచ్‌ఐవీ ఇంజెక్షన్లను అందుబాటులోకి తేవాలని యూఎన్ ఎయిడ్స్ విభాగం వ్యాక్సిన్ కంపెనీలను కోరుతోంది.
  • 2025 నాటికి వార్షిక కొత్త హెచ్‌ఐవీ కేసులను 3.70 లక్షలలోపుకు తగ్గిస్తామని ప్రపంచ దేశాల ప్రభుత్వాధినేతలు అంటున్నారు.
Follow us