Site icon HashtagU Telugu

Weakest Passport: ప్రపంచంలో అత్యంత బలహీనమైన పాస్ పోర్ట్.. పూర్తి వివరాలివే!

Passports

Passports

Weakest Passport: పాస్ పోర్ట్ అనేది విదేశాలకు వెళ్లేవారికి ఒక ఐడెంటిటీ. ఇది ఏ దేశానికి చెందినవారో తెలిపే ఒక గుర్తింపు కార్డుగా ఉంది. దీని ఆధారంగానే ప్రపంచంలోని ఏ దేశానికైనా వెళ్లి రావచ్చు. ప్రతి దేశంలోనూ పౌరులకు వారి దేశాల్లో పాస్ పోర్ట్ అనేది ఉంటుంది. తమ దేశం సరిహద్దు దాటి ఇంకో దేశానికి వెళ్లేవారికి పాస్ పోర్టు అనేది ముఖ్యం. పాస్ పోర్టును చూపితే ఆ దేశం వీసాను కూడా మంజూరు చేస్తుంది. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి పాస్ పోర్టు, వీసాపై అవగాహన అవసరం. అయితే శక్తివంతమైన పాస్ పోర్టు ఉండే దేశాలేవి? అందులో భారత్ ఎక్కడుందో ఒకసారి తెలుసుకుందాం.

ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ అందించే ప్రత్యేక డేటా ప్రకారంగా చూస్తే లండన్‌కు చెందిన గ్లోబల్ పౌరసత్వం, నివాస సలహా సంస్థ హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ 2023 సంవత్సరానికి గానూ హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్‌ను రిలీజ్ చేసింది. ప్రపంచంలోని అన్ని దేశాల పాస్ పోర్టులు పరిధులను బట్టి స్కోర్ ను ఆ నివేదికలో తెలిపింది. ఆ పాస్ పోర్టుతో వేరే దేశాల్లో వీసా రహిత ప్రయాణాలను బట్టి ర్యాంకింగ్స్ తెలిపింది.

ఆ నివేదికలో ప్రకారంగా చూస్తే భారతీయ పాస్‌పోర్ట్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ గా నిలిచింది. 2023లో భారత్ పాస్ పోర్ట్ స్థానం 85గా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 59 వీసా-రహిత ప్రయాణాలను భారత్ పాస్ పోర్టుతో చేయొచ్చు.

ఈ జాబితాలో అత్యంత అడుగున నిలిచిన బలహీనమైన పాస్ పోర్ట్ దేశంగా ఆప్ఘనిస్తాన్ నిలిచింది. ఆ దేశం స్థానం 109గా ఉంది. ఆ దేశం కన్నా ముందు స్థానంలో 108వ స్థానంలో ఇరాక్ పాస్ పోర్టు నిలిచింది. అదేవిధంగా సిరియా 107, పాకిస్తాన్ 106, యెమెన్ 105వ స్థానాల్లో కొనసాగుతున్నాయి.