ప్రస్తుతం దేశవ్యాప్తంగా టమోటా ధరలు ఏ రేంజ్ లో ఉన్నాయో మనందరికీ తెలిసిందే. దేశంలోనే ఏపీ తెలంగాణతో పాటు మిగతా రాష్ట్రాలలో టమోటా ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్య ప్రజలు టమోటా పేరు వింటేనే భయపడిపోతున్నారు. కొంతమంది టమోటాని కొనడమే మానేశారు. రెండు నెలల కిందటి వరకు సామాన్యులకు అందుబాటులోనే ఉన్న టొమాటో ధరలు ఇటీవలి కాలంలో కళ్లుబైర్లు కమ్మిస్తున్నాయి. మొన్నటి వరకు పది రూపాయలకు రెండు కిలోలు మూడు కిలోలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అటువంటిది ఒకేసారిగా 200 నుంచి 300 వరకు పలుకుతుండడంతో టమాటాను కొనుగోలు చేయాలి అంటేనే భయపడిపోతున్నారు. దేశవ్యాప్తంగా టొమాటో ధరలు కిలో వంద రూపాయలకు పైగానే ఉన్నాయి. కొన్నిచోట్ల కిలో రెండువందల యాభై వరకు కూడా పలుకుతున్నాయి. ఈ ధరలకే జనాలు భయపడిపోతున్నారు. కానీ ఇటువంటి సమయంలోనే ఒక టమాటా వార్త విన్న చాలా మంది షాక్ అవుతున్నారు.. టమాట బంగారం కంటే ఎక్కువట. అదేంటి టమాట 300 రూపాయలు బంగారం కొన్ని వేలల్లో ఉంది కదా అంటే ఇది కొన్ని దేశాల్లో మాత్రమే.
కానీ ఇప్పుడు మనం తెలుసుకోబోయే టమోటా ధర కోట్లలో పలుకుతోంది. హజేరా జెనెటిక్స్ అనే యూరోపియన్ విత్తనాల కంపెనీ సమ్మర్ సన్ రకానికి చెందిన టొమాటో విత్తనాలను కిలో 3.50 లక్షల డాలర్లకు అనగా మన ఇండియన్ కరెన్సీ ప్రకారం సుమారుగా రూ.3 కోట్లు విక్రయిస్తోంది. ఈ విత్తనాలతో పండే టొమాటోల ధర యూరోప్ మార్కెట్‌లో కిలో దాదాపు 30 డాలర్ల అనగా సుమారు రూ.2,500 వరకు ఉంటుంది. ఈ లెక్కన మన టొమాటోలు చౌకగా దొరుకుతున్నట్లే. ఈ రకం ఒక్కో విత్తనానికి సగటున ఇరవై కిలోల వరకు దిగుబడినిస్తుంది.