World War 3 : వరల్డ్‌ వార్‌-3 తప్పదా..? నోస్ట్రాడమస్ జోస్యం నిజమవుతుందా..?

ఇరాన్‌ సైన్యం ఇజ్రాయెల్‌పై ప్రయోగించిన తాజా డ్రోన్, క్షిపణి దాడిని ప్రస్తావిస్తూ ట్విట్టర్‌ వేదికగా "వరల్డ్ వార్ 3" హ్యాష్‌టాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. సోషల్ మీడియాలో చాలా మంది "నోస్ట్రాడమస్ జోస్యం నిజమవుతుందా" అని కూడా రాసుకొస్తున్నారు.

  • Written By:
  • Publish Date - April 14, 2024 / 05:36 PM IST

ఇరాన్‌ సైన్యం ఇజ్రాయెల్‌పై ప్రయోగించిన తాజా డ్రోన్, క్షిపణి దాడిని ప్రస్తావిస్తూ ట్విట్టర్‌ వేదికగా “వరల్డ్ వార్ 3” హ్యాష్‌టాగ్‌ ట్రెండ్‌ అవుతోంది. సోషల్ మీడియాలో చాలా మంది “నోస్ట్రాడమస్ జోస్యం నిజమవుతుందా” అని కూడా రాసుకొస్తున్నారు. మైకేల్ డి నోస్ట్రడామె సాధారణంగా లాటిన్ భాషలో “నోస్ట్రడామస్” అని వ్రాస్తారు. ఇతను ఫ్రాన్స్‌కు చెందిన ఒక సిద్ధాంతకర్త, వైద్యుడు కూడా. ఇతను రాబోవు సంఘటనలను ఊహించి, ముందే తన రచనలలో వ్రాసుకున్నాడు. ఈ రచనలకు “ప్రాఫెసీస్ ఆఫ్ నోస్ట్రడామస్” అని పేరు. మన తెలుగులో కాలజ్ఞానం వ్రాసుకోవడం లాగా. ఇతను తన రచనలనందు ప్రపంచంలో ముదు జరుగబోవు ముుఖ్య ఘటనలను, ఘట్టాలను వివరించడానికి ప్రయత్నించాడు. 16వ శతాబ్దపు ప్రసిద్ధ ఈ ఫ్రెంచ్ జ్యోతిష్కుడిని డూమ్ ప్రవక్త అని పిలుస్తారు. అతని అంచనాలు తరచుగా ప్రజల వెన్నులో వణుకు పుట్టించాయి.

నోస్ట్రాడమస్ తన పుస్తకం ‘లెస్ ప్రొఫెసీస్’ (ది ప్రొఫెసీస్)లో 2024 సంవత్సరానికి సంబంధించి కొన్ని భయానక అంచనాలు చేశాడు. వాటిలో కొన్ని ఇప్పటికే నిజమయ్యాయి, మరికొన్ని పురోగతిలో ఉన్నాయి. ఉదాహరణకు, 2024లో ప్రపంచం చూసే భయంకరమైన నావికా యుద్ధాన్ని అతను ఊహించాడు. ఇది చాలా వింతగా ఉంది, కాదా? ఎందుకంటే.. ఏప్రిల్ 13న, ఇరాన్ యూదు దేశంపై ఆత్మాహుతి డ్రోన్, క్షిపణులు, రాకెట్ దాడితో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ఉత్తర, దక్షిణ ఇజ్రాయెల్ నుండి ఉత్తర వెస్ట్ బ్యాంక్, డెడ్ సీ వరకు విస్తరించి ఉన్న అనేక ప్రాంతాలలో వైమానిక దాడి సైరన్‌లు వినిపించడంతో, నావికా యుద్ధం, భౌగోళిక రాజకీయ కలహాల గురించి నోస్ట్రాడమస్ చెప్పిన విషయాలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఇరాన్ సూసైడ్ డ్రోన్లు, క్షిపణులు, రాకెట్లను ఉపయోగించి ఇజ్రాయెల్‌ను నేరుగా సవాలు చేస్తూ మల్టీఫ్రంట్ దాడిని ప్రారంభించడంతో, నెట్టింట వరల్డ్‌ వార్-3 గురించి అందరూ పోస్ట్‌లు చేస్తున్నారు. ప్రపంచ యుద్ధం 3 ప్రారంభమైతే, రెండు వైపులా ఉంటాయని చాలా మంది వినియోగదారులు విశ్వసిస్తున్నారు. ఇప్పటికే పాలస్తీనాతో వివాదంలో నిమగ్నమై ఉన్న ఇజ్రాయెల్, ఏప్రిల్ 13న వరుస దాడులను ఎదుర్కొంది, ఇరాన్ దాని మిత్రదేశాలైన సిరియా, యెమెన్ మరియు ఇరాక్ యొక్క భూమిని ఉపయోగించి ఇజ్రాయెల్ వైపు డ్రోన్‌ను ప్రయోగించింది. డమాస్కస్‌లో వైమానిక దాడి ఇరాన్ కాన్సులేట్‌ను ధ్వంసం చేసిన నేపథ్యంలో ఈ దాడి జరిగింది, ఇందులో ఇద్దరు ఉన్నత స్థాయి ఇరానియన్ జనరల్‌లతో సహా 12 మంది మరణించారు. అయితే, ఈ ఇరాన్‌ దాడిని ఇజ్రాయిల్ సమర్థవంతంగా ఎదుర్కొంది.

ఇజ్రాయిల్‌ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ వందలాదిగా వస్తున్న డోన్లు, మిస్సైళ్లను ఆకాశంలో అడ్డగించి బూడిద చేశాయి. ఇజ్రాయిల్ రక్షణ వ్యవస్థలో కీలమైన “ఐరన్ డోమ్”, “డేవిడ్ స్లింగ్”, “ఆరో డిఫెన్స్ సిస్టమ్స్” ఆ దేశాన్ని రక్షించాయి. ఇరాన్ నుంచి డ్రోన్లు, మిస్సైళ్లు వస్తున్నట్లు గుర్తించిన వెంటనే దేశంలో సైరన్లు మోగాయి. ఇజ్రాయిల్ తన రక్షణ వ్యవస్థను అప్రమత్తం చేయడంతో.. ఆరో డిఫెన్స్ వ్యవస్థ చాలా డ్రోన్లను, మిస్సైళ్లను నాశనం చేసింది.
Read Also : Viral Video : రాళ్ల దాడిపై YSRCP నేతల జోకులు..!