Site icon HashtagU Telugu

World Soil Day: ప్రపంచ మట్టి దినోత్సవం..

World Siol Day

World Siol Day

World Soil Day: భూమి (Earth) పై ఉన్న మనుషుల కంటే ఒక టేబుల్ స్పూన్ మట్టి (Soil) లో ఎక్కువ జీవకణాలు ఉన్నాయనేది మీకు తెలుసా? ఈ రోజున భూమి సాంద్రత గురించి, మట్టి (Soil) క్షీణత గురించి, అందరిలోనూ అవగాహన పెంచే విధంగా కొంత మాట్లాడుకోవడం ఎంతైనా అవసరం. నేల అనేది జీవులు, ఖనిజాలు, సేంద్రీయ భాగాలతో రూపొందించబడిన ప్రపంచం, ఇది మొక్కల పెరుగుదల ద్వారా మానవులకు, జంతువులకు ఆహారాన్ని అందిస్తుంది. మనలాగే, నేల ఆరోగ్యంగా ఉండటానికి తగిన మొత్తంలో పోషకాల సమతుల్యత అవసరం. వ్యవసాయ వ్యవస్థలతో ప్రతి పంటతోనూ భూమి (Earth) లోని పోషకాలు కోల్పోతాయి, ఈ సంయంలో నేలను నిలకడగా నిర్వహించకపోతే, ఆహారాన్ని ఉత్పత్తి చేసే గుణాన్ని కోల్పోతుంది. దీనితో నేలలో పోషక లోపం ఉన్న మొక్కలు ఉత్పత్తి అవుతాయి. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే రాబోవు తరాలకు నష్టం.

సేంద్రీయ ఎరువులు లేని నేలలోని మట్టి (Soil) ఆరోగ్యంగా ఉంటుంది. నేల క్షీణత వల్ల కొన్ని నేలలు పోషకాలు తగ్గిపోయి పంటలకు మద్దతు ఇచ్చే సామర్థ్యాన్ని కోల్పోతాయి, మరికొన్ని మొక్కలు, జంతువులకు విషపూరిత వాతావరణాన్ని సూచించే అధిక పోషక సాంద్రతను కలిగి ఉంటాయి, ఇవి పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి. వాతావరణ మార్పులకు కారణమవుతాయి.

ఆహార సంక్షోభం:

నేలను ఆరోగ్యంగా ఉంచలేకపోవడానికి ప్రధాన కారణం పంట పండించే దశలో అధికంగా రసాయనాలు వాడకం, రసాయనాలు కలిసిన నీటిని భూమిలోనికి వదలడం, నీటి కాలుష్యం, వ్యర్థాలను భూమిలో కలిసేలా వదిలేయడం, ఫ్లాస్టిక్ వాడకం పెరిగిపోవడం వంటి కారణాలతో మట్టి కలుషితం అవుతుంది. గత 70 సంవత్సరాలలో, ఆహారంలో విటమిన్లు, పోషకాల స్థాయి బాగా తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ల మంది ప్రజలు సూక్ష్మపోషకాల కొరతతో బాధపడుతున్నారని అంచనా వేయబడింది. సారవంతమైన భూమిని కోల్పోవడం వల్ల భవిష్యత్ తరాలను సంక్షోభంలో పడవేసే పరిస్థితుల్లోకి వెళుతున్నాం.

నీటి కొరత:

నీటి వినియోగంలో తీసుకోవలసిన జాగ్రత్తలను పాటించక వర్షపు నీటిని నిల్వచేయలేని స్థితిలో నీటి కొరత ఏర్పడుతుంది. వాతావరణంలో మార్పులు, సకాలంలో వర్షాలు కురవకపోవడం, అడవుల నరికి వేత, మొక్కలు పెంచకపోవడం, నీరు నిల్వచేయలేకపోవడం, జల వనరులు తరిగిపోవడం వంటి కారణాలతో నీటి కొరత ఏర్పడుతుంది.

జీవ వైవిధ్యంలో నష్టం:

జీవవైవిధ్య నష్టం ప్రపంచవ్యాప్తంగా వివిధ జాతుల అంతరించిపోవడం వల్ల జరుగుతుంది, ఆహార కొరత కారణంగా ఎన్నో జంతు జాతులు అంతరించి పోతున్నాయి. నష్టానికి దారితీసే పర్యావరణ క్షీణత పర్యావరణ, అధిక జనాభా, కాలుష్యం ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు.

వాతావరణ మార్పు:

అడవుల నరికివేతతో సకాలంలో వర్షాలు పడకపోవడం, నీటి కొరత, మంచు వేగంగా కరిగిపోవడం, తగ్గిన కార్బన్ నిల్వ, పెద్ద జంతు జాతులను కోల్పోవడం వాతావరణంలో మార్పులకు కారణం కావచ్చు.

జీవనోపాధి కోల్పోవడం:

రోజు రోజుకూ పెరుగుతున్న మిషనరీ వినియోగం ప్రధానంగా ఈ పరిస్థితికి కారణం కావచ్చు. నలుగురు చేసే పనిని ఒక యంత్రం సాయంతో త్వరగా చేసేయచ్చనే విధానం వల్ల ఉపాధి కొరత ఏర్పడుతుంది. తగినంత వేతనం లేకపోవడం, ఉపాధి అవకాశాలు తగ్గడం, వలస వెళ్ళి పోవడం వంటి కారణాలతో జీవనోపాధిని కోల్పోతున్నాం.

వలస:

ఉపాధి అవకాశాలు కోల్పోవడంతో వలస వెళ్ళేందుకు సిద్ధపడుతున్నారు. పట్టణాల్లో కూలీలుగా ఉన్న ఎందరో వ్యవసాయాన్ని వదిలి వచ్చినవారే. వ్యవసాయానికి తగిన ప్రోత్సాహం లేకపోవడం, ఆర్థికంగా పరిస్థితి క్షీణించి ఉండటం కూడా ప్రధాన కారణం.

నేలను కాపాడుకునేందుకు మన వంతు కృషి అవసరం, తడిపొడి చెత్తను వేరుచేయడం, ఫ్లాస్టిక్ కారకాలను నాసనం చేయడం, రసాయనాలను భూమిలోనికి ఇంక కుండా జాగ్రత్తలు తీసుకోవడం, వాయు కాలుష్యం నివారణలు పాటించండం, నీటిని కలుషితం కాకుండా కాపాడుకోవడం, మొక్కలు పెంచడం ప్రతి ఒక్కరి బాధ్యత.

Exit mobile version