Site icon HashtagU Telugu

Spy Chiefs Secret Meet : స్పై చీఫ్ ల ఎమర్జెన్సీ మీటింగ్..ఏదో జరుగుతోంది ?

Spy Chiefs Secret Meet

Spy Chiefs Secret Meet

Spy Chiefs Secret Meet  : వాళ్ళందరూ మామూలు వ్యక్తులు కాదు.. 

ఇండియా.. చైనా.. అమెరికా.. జపాన్.. వంటి దేశాల గూఢచారి (స్పై)  విభాగాల అధిపతులు. 

అంతటి కీలక హోదాల్లో ఉన్నవాళ్ళు సింగపూర్ లో ఎమర్జెన్సీ మీటింగ్  పెట్టుకున్నారు.. 

ఇంతకీ వాళ్ళు ఎందుకు మీట్ అయ్యారు ? మీటింగ్ లో ఏం చర్చించారు ? ఏయే దేశాలు డుమ్మా కొట్టాయి ?

స్పై చీఫ్ ల ఎమర్జెన్సీ మీటింగ్ లో ఇండియా నిఘా సంస్థ  రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)  అధిపతి సమంత్ గోయెల్, అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అవ్రిల్ హైన్స్ కూడా పాల్గొన్నారు. ఈ సమావేశానికి చైనా, ఇండియా, అమెరికా  సహా  మొత్తం  24కుపైగా దేశాల స్పై చీఫ్ లు హాజరయ్యారు. చైనా, అమెరికాల మధ్య విబేధాలు తారా స్థాయికి చేరిన తరుణంలో జరిగిన ఈ మీటింగ్ ప్రాధాన్యతను సంతరించుకుంది.  వాస్తవానికి ఈ స్పై చీఫ్ లు అందరూ జూన్ 2 నుంచి 4వ తేదీ వరకు జరుగుతున్న  “షాంగ్రీ-లా డైలాగ్” భద్రతా సదస్సుకు హాజరయ్యేందుకు సింగపూర్ కు వచ్చారు. ఆ సదస్సులో సింగపూర్, ఆస్ట్రేలియా , బ్రూనై , కంబోడియా,  కెనడా, చిలీ ,  చైనా , ఫ్రాన్స్ , జర్మనీ , ఇండియా ,  ఇండోనేషియా , జపాన్ , దక్షిణ కొరియా ,  లావోస్ , మలేషియా , మంగోలియా ,  మయన్మార్ , న్యూజిలాండ్, పాకిస్తాన్ , ఫిలిప్పీన్స్ , రష్యా , శ్రీలంక , స్వీడన్ , థాయిలాండ్ , తైమూర్-లెస్టే , ఉక్రెయిన్ , యునైటెడ్ కింగ్డమ్ , యునైటెడ్ స్టేట్స్ , వియత్నాం  దేశాల రక్షణ మంత్రుల మధ్య చర్చలు జరిగాయి.

Also read : Spy Balloons: చైనా నిఘా బెలూన్ తో అమెరికా రక్షణశాఖ పైలట్ సెల్ఫీ

చైనా రక్షణ మంత్రి కామెంట్స్ కలకలం.. 

ఇందులో చైనా రక్షణ మంత్రి లీ షాంగ్ఫు మాట్లాడుతూ.. అమెరికాపై నిప్పులు చెరిగారు. “ఒకవేళ అమెరికా మాతో కయ్యానికి కాలు దువ్వితే యావత్ ప్రపంచం భరించలేనంత విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుంది” అని ఆయన వార్నింగ్ ఇచ్చారు. దీంతో రెండు దేశాల మధ్య ఉద్రికతలు మరింత పెరిగాయి. ఈ తరుణంలో  “షాంగ్రీ-లా డైలాగ్” భద్రతా సదస్సు చివరి రోజున (జూన్ 4)  సదస్సుకు హాజరైన అన్ని దేశాల స్పై చీఫ్ లు హాజరై చర్చించుకున్నారు. అయితే ఈ మీటింగ్ కు రష్యా హాజరు కాలేదు. ప్రస్తుతం కోల్డ్ వార్ చేసుకుంటున్న  చైనా, అమెరికా స్పై చీఫ్ లు హాజరయ్యారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాకు చైనా ఆర్థిక సాయం, ఆయుధ సాయం చేసిందని గతంలో అమెరికా ఆరోపించింది.  దానిపై  స్పై చీఫ్ ల మధ్య డిస్కషన్ జరిగి ఉంటుందని భావిస్తున్నారు. తైవాన్, హాంకాంగ్ లపై అమెరికా జోక్యాన్ని చైనా వ్యతిరేకిస్తోంది. ఈ అంశాన్ని చైనా స్పై చీఫ్  మీటింగ్ లో లేవనెత్తి ఉండొచ్చని అంటున్నారు.