Pakistan Economic Crisis: ఎన్నికల ముందు పాక్ కు షాకిచ్చిన వరల్డ్ బ్యాంకు

అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్ కు ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు

Published By: HashtagU Telugu Desk
Pakistan Economic Crisis

Pakistan Economic Crisis

Pakistan Economic Crisis: అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్థాన్ కు ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభాన్ని చక్కదిద్దేందుకు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని స్పష్టం చేసింది. సైనిక, రాజకీయ, వాణిజ్య రంగాల్లో నేతల స్వార్థ ప్రయోజనాలను పక్కనపెట్టాల్సిన సమయం ఆసన్నమైందని ప్రపంచబ్యాంకు పాకిస్థాన్ ప్రతినిధి నజీ బన్హాసిన్ అన్నారు.

పాకిస్థాన్ ప్రస్తుతం సంక్షోభం అంచున ఉంది. జనాభాలో 40 శాతం మంది దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. ద్రవ్యోల్బణం, పెరుగుతున్న విద్యుత్ ధరలు మరియు తగిన వనరుల కొరత వంటి అనేక ఆర్థిక సమస్యలను పాకిస్థాన్ ఎదుర్కొంటోంది. పిల్లల విద్యా ప్రమాణాలు, శిశు మరణాలు వంటి సూచికలు పాకిస్థాన్ పేదరికం తారాస్థాయికి చేరుకుందని నజీ బన్హాసిన్ అన్నారు.

2000 మరియు 2020 మధ్య, పాకిస్తాన్ సగటు వాస్తవ తలసరి వృద్ధి రేటు 1.7 శాతం మాత్రమే. ఇది దక్షిణాఫ్రికా దేశాల సగటు తలసరి వృద్ధి రేటులో సగం కంటే తక్కువని నజీ వెల్లడించారు. మానవాభివృద్ధి సూచీలో దక్షిణాసియాలో పాకిస్థాన్ అట్టడుగు స్థానంలో ఉంది. విదేశీ నిల్వలు అడుగుతున్నాయి. వాతావరణ మార్పులు దేశానికి శాపంగా మారుతున్నాయి.

వచ్చే జనవరిలో పాకిస్థాన్‌లో జాతీయ స్థాయిలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. దేశంలో ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దాల్సిన సమయం ఇది. నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం ఉచిత వాగ్దానాల జోలికి వెళ్లకూడదన్నారు. ఆర్థిక రంగాన్ని మెరుగుపరిచేందుకు నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని కోరారు. వృధా వ్యయాలను తగ్గించుకోవాలని ప్రపంచ బ్యాంకు సూచించింది. ప్రజాసేవలు, మౌలిక సదుపాయాలపై పరిమిత వ్యయం ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.

Also Read: Myra Vaikul Video Viral: నా గణపయ్యని తీసుకెళ్లొద్దు: చిన్నారి ఏడుపు

  Last Updated: 24 Sep 2023, 12:20 PM IST