ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల క్రూరత్వం గురించి చాలా వార్తలు వచ్చాయి. ముఖ్యంగా మహిళలపై తాలిబన్ పాలకులు అనేక ఆంక్షలు విధించారు. తాజాగా ఆఫ్ఘనిస్థాన్‌లోని తఖర్ ప్రావిన్స్‌లో ఓ భయానక వీడియో బయటపడింది. ఈ వీడియోలో మానవత్వం లేకుండా వ్యవహరించారు తాలిబన్లు. ఓ మహిళను దారుణంగా కొట్టడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఈ బాధాకరమైన వీడియోను షబ్నం నసిమి అనే మహిళ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. మగ సంరక్షకుని తోడు లేకుండా మహిళలు బయటకి వెళ్లకూడదనే కొత్త తాలిబాన్ నియమాన్ని ఉల్లంఘించినందుకు కొరడాతో మహిళను తీవ్రంగా కొట్టారు.
షబ్నం అనే సోషల్ మీడియా యూజర్ ఈ వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చింది, ‘ఇది తాలిబాన్. ఇక్కడ తఖర్ ప్రావిన్స్‌లో మగ సంరక్షకుడు లేకుండా షాపింగ్‌కు వెళ్లిన మహిళను దారుణంగా కొట్టారు. తాలిబన్ల పాలనలో ఆఫ్ఘనిస్థాన్ మహిళలు భూమ్మీద నరకం అనుభవిస్తున్నారు. మనం కళ్లు మూసుకోకూడదు అని పేర్కొంది. గత బుధవారం ముగ్గురు మహిళలు, 11 మంది పురుషులు దొంగతనం కేసులో దోషులుగా తేలిన తరువాత ఆఫ్ఘన్ కోర్టు ఆదేశాల మేరకు కొరడాలతో కొట్టినట్లు వార్తా సంస్థ AFP పేర్కొంది.
సీనియర్ తాలిబాన్ నాయకుడు హైబతుల్లా అఖుంద్‌జాదా గత నెలలో ఇస్లామిక్ చట్టంలోని అంశాలను పూర్తిగా అమలు చేయాలని న్యాయమూర్తులను ఆదేశించాడు. ఇందులో బహిరంగ మరణశిక్షలు, రాళ్లతో కొట్టడం, కొరడా దెబ్బలు, దొంగలకు శరీర భాగాలను కత్తిరించడం వంటివి ఉన్నాయి. వివిధ నేరాలకు పాల్పడిన వ్యక్తులపై తాలిబాన్లు బహిరంగంగా కొరడా ఝులిపిస్తున్న వీడియోలు, చిత్రాలతో సోషల్ మీడియాలో నెలల తరబడి కనిపిస్తున్నాయి. 2001 చివరలో ముగిసిన తాలిబాన్లు మొదటి పాలనలో జాతీయ స్టేడియంలో కొరడాలతో కొట్టడం, ఉరితీయడం వంటి బహిరంగ మరణశిక్షలను క్రమం తప్పకుండా అమలు చేశారని ఒక నివేదిక పేర్కొంది.
https://twitter.com/NasimiShabnam/status/1598324324225662978?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1598324324225662978%7Ctwgr%5E683d92c0040248211be20b1249636efcc2d49adb%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.ndtv.com%2Fworld-news%2Fvideo-women-flogged-in-afghanistan-for-shopping-without-male-guardian-3572428