Burp Record: త్రేన్పుతో వరల్డ్ రికార్డ్స్ చోటు దక్కించుకున్న మహిళ?

మామూలుగా ఏదైనా గ్యాస్ ఉన్న కూల్ డ్రింక్ తాగినప్పుడు త్రేన్పు లు రావడం అన్నది సహజం. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా త్రేన్పుతూ ఉంటారు. కొందరు

  • Written By:
  • Publish Date - August 4, 2023 / 03:50 PM IST

మామూలుగా ఏదైనా గ్యాస్ ఉన్న కూల్ డ్రింక్ తాగినప్పుడు త్రేన్పు లు రావడం అన్నది సహజం. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా త్రేన్పుతూ ఉంటారు. కొందరు చిన్నగా త్రేన్పితే మరికొందరు బిగ్గరగా త్రేన్పుతూ ఉంటారు. తాజాగా అమెరికాకు చెందిన ఒక మహిళ గట్టిగా త్రేన్పి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికా లోని మేరీలాండ్ కు చెందిన కింబర్లీ కిమికోలా వింటర్ అనే మహిళ 107.3 డెసిబెల్స్ శబ్దంతో గట్టిగా త్రేన్పి..అతి పెద్ద త్రేన్పు రికార్డును సొంతం చేసుకుంది.

అయితే ఈమె కంటే ముందు ఇటలీకి చెందిన ఎలీసా కాగ్నోని ఈ ఘనతను దక్కించుకుంది. 107 డెసిబెల్స్ శబ్దంతో ఆమె త్రేన్పు రప్పించింది. ఇక పురుషుల్లో ఇలాంటి రికార్డును ఆస్ట్రేలియాకు చెందిన నెవిల్లే షార్ప్ పేరుతో ఉంది. అతను112.7 డెసిబెల్స్ శబ్దంతో ఈ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. తాజాగా రికార్డును సొంతం చేసుకున్న మహిళ.. కిచెన్‌లో వినియోగించే బ్లెండర్‌ 70 నుంచి 80 డెసిబెల్స్‌ శబ్దం చేస్తుంది. హ్యాండిల్‌ డ్రిల్ మిషన్‌ 90-95 కొన్ని ద్విచక్ర వాహనాలు 100-110 డెసిబెల్స్‌ శబ్దాలు చేస్తాయి.

కిమీకోలా వాటిని మించిపోయింది. ఆమె తాజా త్రేన్పును ఐ హార్ట్‌ రేడియో స్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ప్రత్యక్షంగా అందరికీ వినిపించారు. త్రేన్పు బిగ్గరగా రావడానికి ముందు ఆమె బ్రేక్‌ ఫాస్ట్ చేసింది, కాఫీ, బీర్‌ తాగింది. ఏ ఆహారం తీసుకుని, ఏయే పానీయాలు తాగితే త్రేన్పు పెద్దగా వస్తుందో తెలుసుకోవడానికి ఆరు వారాలపాటు సాధన చేసింది. స్పైసీ ఫుడ్స్‌, సోడా, ఆల్కహాల్‌తో ఉపయోగం ఉంటుందని తెలుసుకుంది. నీళ్లు తాగి కూడా త్రేన్పు తెప్పించగల నేర్పు ఆమె సాధించింది.