Site icon HashtagU Telugu

Iran: ఇరాన్ రష్యాకు ద్రోహం చేస్తుందా? J-10C ఫైటర్ జెట్లను ఎందుకు కొనుగోలు చేస్తుంది?

Iran

Iran

Iran: ఇజ్రాయెల్‌తో జరిగిన సంఘర్షణ సమయంలో రష్యా ఇరాన్‌కు (Iran) బహిరంగంగా మద్దతు ఇచ్చింది. ఇజ్రాయెల్ దాడులతో పాటు న్యూక్లియర్ సైట్లపై అమెరికన్ ఎయిర్‌స్ట్రైక్‌లను తీవ్రంగా ఖండించింది. అయితే, అదే రష్యాను చైనా కోసం ఇప్పుడు ఇరాన్ మోసం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ఇరాన్ రష్యాతో 4.5వ తరం ఫైటర్ జెట్ Su-35 కోసం ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఇప్పుడు చైనా 4.5వ తరం J-10C ఫైటర్ జెట్‌ను కొనుగోలు చేయాలని యోచిస్తోంది. ఈ ఫైటర్ జెట్ పాకిస్థాన్ వైమానిక దళంలో కూడా ఉంది.

ఇరాన్‌కు ప్రస్తుతం అప్‌డేటెడ్ ఫైటర్ జెట్‌లు చాలా అవసరం. ఇటీవల ఇజ్రాయెల్ దాడిని కూడా ఎదుర్కొంది. ఇది F-16, F-35 వంటి అద్భుతమైన ఫైటర్ జెట్‌లను ఉపయోగిస్తుంది. అయితే ఇరాన్ వైమానిక దళం ఇప్పటికీ F-4 ఫాంటమ్, MiG-29 వంటి పాత ఫైటర్ జెట్‌లపై ఆధారపడుతోంది. వీటిలో చాలా 50 ఏళ్లకు పైగా పాతవి. అందుకే ఇరాన్ వీలైనంత త్వరగా 4.5వ తరం ఫైటర్ జెట్‌లను పొందాలని కోరుకుంటోంది.

Su-35 స్థానంలో J-10Cని ఎందుకు కొనుగోలు చేయాలనుకుంటోంది?

డిఫెన్స్ సెక్యూరిటీ ఆసియా వెబ్‌సైట్ ప్రకారం.. ఇరాన్ మొదట రష్యన్ Su-35ని కొనుగోలు చేయాలని భావించింది. దీని కోసం ఒప్పందం కూడా కుదుర్చుకుంది. కానీ దాని డెలివరీలో జాప్యం జరగడంతో ఇప్పుడు ఇరాన్ దృష్టి చైనా J-10C వైపు మళ్లింది. ఇజ్రాయెల్ ఎప్పుడైనా ఇరాన్‌పై దాడి చేయవచ్చని ఇరాన్ సైనిక అధికారులు భావిస్తున్నారు. కాబట్టి వీలైనంత త్వరగా అప్‌డేటెడ్ ఫైటర్ జెట్‌లు తమ వద్ద ఉండాలని కోరుకుంటున్నారు.

Also Read: IND vs ENG 2nd Test Weather: భారత్- ఇంగ్లాండ్ రెండో టెస్ట్‌.. వ‌ర్షం కురిసే అవ‌కాశం?

J-10C, Su-35లో ఏ ఫైటర్ జెట్ మంచిది?

చైనా J-10C, రష్యన్ Su-35 రెండూ అప్‌డేటెడ్ ఫైటర్ జెట్‌లే అయినప్పటికీ J-10C ఒక మధ్యస్థ బరువు, సింగిల్-ఇంజిన్ జెట్. అయితే Su-35 ఒక భారీ, డబుల్-ఇంజిన్ విమానం. రాడార్ గురించి మాట్లాడితే J-10Cలో AESA రాడార్ ఉంది. ఇది Su-35 రాడార్ కంటే మెరుగైనది. J-10Cలో PL-10, PL-15 మిసైల్స్ ఉండగా, Su-35లో రష్యా ప్రమాదకరమైన R-74, R-77-1 మిసైల్స్ ఉన్నాయి. అంతేకాక Su-35 అత్యంత ప్రత్యేక లక్షణం ఏమిటంటే Su-35లో J-10C కంటే ఎక్కువ పేలోడ్ సామర్థ్యం, ఇంజిన్ శక్తి చాలా మెరుగ్గా ఉంది.

J-10Cని అమెరికన్ F-16తో పోలుస్తారు

J-10Cని చైనా PLA 2006లో తమ బెడెలో చేర్చుకుంది. 2025 నాటికి చైనా వద్ద సుమారు 220 J-10C ఫైటర్ జెట్‌లు ఉన్నాయి. ఈ ఫైటర్ జెట్‌ను తరచూ అమెరికా F-16 ఫైటర్ జెట్‌తో పోలుస్తారు. ఒకవేళ ఇరాన్ అధికారికంగా J-10C ఒప్పందం కుదుర్చుకుంటే ఇది డిఫెన్స్ మార్కెట్‌కు పెద్ద మార్పును తెస్తుంది. రష్యాకు పెద్ద దెబ్బగా నిలుస్తుంది.