Yogi Adityanath: యోగి ఆదిత్యనాథ్.. డైనమిక్ లీడర్‌గా యావత్ దేశానికి సుపరిచితులు. ఉత్తరప్రదేశ్ సీఎంగా ఆయన పాలన సాగిస్తున్న తీరు గురించి యావత్ ప్రపంచానికి తెలుసు. లా అండ్ ఆర్డర్‌ను ధిక్కరించే వాళ్ల గుండెల్లో యోగి సింహమై నిద్రిస్తున్నారు. వాళ్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నారు. కొత్త అప్‌డేట్ విషయానికి వస్తే.. భారత్‌లోని ఉత్తరప్రదేశ్ నుంచి 406 కి.మీ దూరంలో ఉండే నేపాల్‌లోనూ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేరు ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఎందుకో తెలుసుకుందాం..
Also Read :Holi Festival: హోలీ వేళ.. ఈ మూడు రాశుల వారికి అదృష్ట యోగం
రాచరికం కావాలంటూ ర్యాలీలు
నేపాల్‌లో ఇప్పుడు ప్రజలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మళ్లీ తమ దేశంలో రాచరిక పాలన మొదలు కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ర్యాలీల్లో యూపీ సీఎం యోగి ఫొటోలను నిరసనకారులు ప్రదర్శిస్తున్నారు. ప్రత్యేకించి నేపాల్‌లోని రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ (ఆర్‌పీపీ) అనేది రాచరికానికి మద్దతును ప్రకటించారు. ఈ పార్టీయే నిరసనలకు సారథ్యం వహిస్తోంది. భవిష్యత్తులో ఈ నిరసనలు మరింత తీవ్రరూపు దాల్చే అవకాశాలు లేకపోలేదు. ఇంతకీ నేపాల్ నిరసన ర్యాలీలలో యోగి ఆదిత్యనాథ్ ఫొటోలను ఎందుకు వాడుతున్నారు.. అనే ప్రశ్న మీ మైండ్‌లో ఉదయించిందా ? మరేం లేదు.. నేపాల్‌లో రాచరిక వ్యవస్థకు సీఎం యోగి ఆదిత్యనాథ్ గతంలో మద్దతు ప్రకటించారు. నేపాల్ మాజీ రాజు జ్ఞానేంద్ర షాతో యోగికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలో జ్ఞానేంద్ర షా భారత్‌లో పర్యటించారు. ఆ సందర్భంగా సీఎం యోగి(Yogi Adityanath)తో ఆయన భేటీ అయ్యారు.
Also Read :Jio Vs Airtel : స్టార్ లింక్‌తో జియో, ఎయిర్‌టెల్ డీల్.. ఎవరికి లాభం ?
ప్రధాని కుట్ర వల్లే యోగి ఫొటో
నేపాల్‌లో జరిగిన నిరసన ర్యాలీలలో యూపీ సీఎం యోగి ఫొటోలను వినియోగించడంపై ఆ దేశంలో విభిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. నిరసనకారులు ప్రదర్శించిన బ్యానర్లలో సీఎం యోగి, మాజీ రాజు జ్ఞానేంద్రల ఫొటోలు ఉన్నాయి. ‘‘మేం రాచరికానికి మద్దతుగా ర్యాలీలు చేస్తున్నాం. ఈ ఉద్యమానికి చెడ్డపేరు తెచ్చేందుకే కొందరు కుట్ర పన్నారు. అందులో భాగంగానే యూపీ సీఎం యోగి ఫొటోలను బ్యానర్లపై ఏర్పాటు చేశారు’’ అని రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ (ఆర్‌పీపీ) ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ‘‘ప్రధాని కేపీ ఓలీ వర్గమే ఈ చర్యకు కుట్ర పన్ని ఉండొచ్చు. ప్రధాని ముఖ్య సలహాదారు బిష్ణు రిమాల్ సూచనమేరకే ఈ ర్యాలీలో యోగి చిత్రాన్ని వాడి ఉండొచ్చు’’ అని ఆర్‌పీపీ ప్రతినిధి తెలిపారు. కాగా, 2008లో నేపాల్‌లో పెద్ద ప్రజా ఉద్యమం జరిగింది. దీంతో రాజు పాలన అంతమైంది. ఇప్పుడు మళ్లీ రాజు పాలన కోరుతుండటం గమనార్హం.