Rishi Sunak: రిషి సునాక్ ఓటమికి కారణం అదేనా ?

రిషి సునాక్‌.. బ్రిటన్ ప్రధాని రేసులోకి దూసుకొచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. గెలుపు ఖాయం అనిపించేలా చేశారు. కానీ టైమ్ గడిచే కొద్దీ రేసులో వెనుకబడ్డారు.

  • Written By:
  • Publish Date - September 6, 2022 / 08:00 AM IST

రిషి సునాక్‌.. బ్రిటన్ ప్రధాని రేసులోకి దూసుకొచ్చి అందరి దృష్టిని ఆకర్షించారు. గెలుపు ఖాయం అనిపించేలా చేశారు. కానీ టైమ్ గడిచే కొద్దీ రేసులో వెనుకబడ్డారు. ప్రత్యర్థి లిజ్ ట్రస్ చేతిలో ఓడిపోయారు. సునాక్ ఓటమికి కారణాలు చాలా ఉన్నాయి. అందులో మొట్టమొదటిది నాన్ లోకల్‌. బ్రిటన్‌లోనే పుట్టినా.. భారత సంతతికి చెందిన వ్యక్తి కావడంతో వైట్ కాదనే ఫీలింగ్‌ రిషిని ఓడించిందనే వాదన ఉంది. రిషి సునాక్ ఓటమిలో బోరిస్ జాన్సన్‌ కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. తను పదవి కోల్పోడానికి రిషినే కారణమని బలంగా నమ్ముతున్నారు బోరిస్‌. అందుకే ఆయనకు వ్యతిరేకంగా పనిచేశారనే ప్రచారం జరిగింది. సునాక్‌కు తప్ప ఎవరికైనా మద్దతివ్వండి అని తన వర్గం టోరీ సభ్యులకు డైరెక్ట్‌గానే చెప్పారట బోరిస్ జాన్సన్‌. అంతేకాదు, లిజ్‌ ట్రస్‌కు పూర్తి మద్దతు ప్రకటించారు.

ఇదే సునాక్ గెలుపు అవకాశాలను దెబ్బకొట్టింది. కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నిక ప్రక్రియ ప్రారంభంలో రిషి సునాక్ ముందంజలో దూసుకెళ్లారు. ఎంపీల్లో ఎక్కువ మద్దతు ఆయనకే లభించింది. ప్రారంభ రౌండ్లన్నింటిలోనూ రిషీనే టాప్‌. తుదిరేసులో ఇద్దరు మిగిలినప్పుడు కూడా ట్రస్ కంటే సునాక్‌కే ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయితే, పోలింగ్ మొదలైనప్పటి నుంచి ట్రస్‌కు ఆధిక్యం పెరుగుతూ వచ్చింది. అధికారంలోకి వస్తే వెంటనే పన్నుల భారాన్ని తగ్గిస్తానని లిజ్ ట్రస్ హామీ ఇవ్వడమే దీనికి కారణంగా విశ్వేషిస్తున్నారు రాజకీయ పండితులు.

రిషి సునాక్ మాత్రం ఫస్ట్ నుంచి ద్రవ్యోల్బణం కట్టడి, ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంపైనే ఫోకస్ పెట్టారు. ప్రధాని రేసులో ఓడినా ప్రభుత్వానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు రిషి సునాక్‌. అయితే లిజ్ ట్రస్ ప్రభుత్వంలో చేరే ఉద్దేశం మాత్రం లేదని స్పష్టంచేశారు.