Chinas No 2 Missing : చైనాలో తెరచాటున ఏదో గూడు పుఠాణీ జరుగుతోంది. గత కొన్ని వారాలుగా కనిపించకుండా పోయిన చైనా ఆర్మీలోని నంబర్ 2 స్థాయి సైనిక అధికారి హీ వీడాంగ్ నేటి వరకు ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆయనకు ఏమైంది ? జైలులో వేశారా ? ఇంకా ఏమైనా చేశారా ? అనే చర్చ ప్రపంచ దేశాల దౌత్య వర్గాల్లో నడుస్తోంది. ప్రస్తుతం చైనాలో అత్యంత పవర్ ఫుల్ నేతగా ఉన్న దేశాధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఏదైనా చేయించి ఉంటారనే టాక్ వినిపిస్తోంది. ఏదైనా బలమైన కారణం ఉండబట్టే, హీ వీడాంగ్‌పై చర్యలు తీసుకొని ఉంటారని విదేశాంగ వ్యవహారాల పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. చైనాకు సంబంధించి అమెరికా, ఇతర పశ్చిమ దేశాల మీడియాలో వచ్చే కథనాలను గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. చైనాను, అక్కడి ప్రభుత్వాన్ని బలహీనపర్చే లక్ష్యంతో పశ్చిమ దేశాల మీడియా కథనాలను అల్లుతుంటుందని గుర్తు చేస్తున్నారు.
Also Read :WhatsApp New Feature: వాట్సాప్‌లో మీరు పంపే ఫైళ్లు సేవ్ కావొద్దా ? ఇదిగో ఫీచర్
హీ వీడాంగ్.. అలా ఎదిగి.. ఇలా మాయమై..
హీ వీడాంగ్ 1957 మే నెలలో జన్మించారు. చైనాలోని నాన్ జింగ్ ప్రాంత ఆర్మీ కాలేజీలో ఆయన డిగ్రీ చేశారు. 1972 డిసెంబరులో చైనా మిలిటరీ స్కూలులో హీ వీడాంగ్ ప్రవేశం పొందారు. 2001లో హీ వీడాంగ్ చైనా ప్రభుత్వానికి చెందిన నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీలో ప్రవేశం పొందారు. చైనా ఆర్మీకి సంబంధించిన విద్యాసంస్థల్లో చదివితే, కోర్సులు పూర్తికాగానే ఆర్మీలో జాబ్ ఇస్తారు. చేసిన కోర్సులను బట్టి ఆర్మీలో పోస్టులను కేటాయిస్తారు. హీ వీడాంగ్ 2013 జులైలో జియాంగ్సు మిలిటరీ జిల్లాలో కమాండర్‌గా చేరారు. ఆ తర్వాత చాలా వేగంగా కెరీర్‌లో ఆయన పదోన్నతులను అందుకున్నారు. కట్ చేస్తే.. ప్రస్తుతం ఆయన చైనాలో అత్యున్నతమైన సెంట్రల్ మిలిటరీ కమిషన్‌కు వైస్ ఛైర్మన్‌గా ఉన్నారు. ప్రభుత్వాన్ని నడిపే చైనా కమ్యూనిస్ట్ పార్టీ 20వ పోలిట్ బ్యూరోలో సభ్యులుగా ఉన్నారు. దేశ అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో ఉన్న పరిచయాల వల్లే హీ వీడాంగ్‌కు ఇంత వేగంగా కెరీర్‌లో ఉన్నతి లభించిందని అంటారు.
Also Read :Hyderabad Vs Earth quakes: భూకంపాల గండం.. హైదరాబాద్ సేఫేనా ? గత పదేళ్ల పాఠమేంటి ?
గతంలోనూ ఎంతోమంది మాయం
సైనిక సమాచారాన్ని లీక్ చేశారనే ఆరోపణలు రావడంతో గతంలో పలువురు సైనిక అధికారుల్ని జిన్‌పింగ్(Chinas No 2 Missing) నిర్దాక్షిణ్యంగా తొలగించారు. గతంలో చైనా విదేశాంగమంత్రి, రక్షణమంత్రిగా పనిచేసినవారు కూడా అదృశ్యమయ్యారు. ఇప్పుడు తన సన్నిహితుడు హీ వీడాంగ్‌ను కూడా ఆయన మాయం చేయించారు. జిన్‌పింగ్ హయాంలో 2012 నుంచి 2022 మధ్య దాదాపు 50లక్షల మంది వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు దర్యాప్తును ఎదుర్కొన్నారు. వారిలో ఏకంగా47లక్షల మంది దోషులుగా తేలారట. దీన్నిబట్టి చైనాలో అవినీతి ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు. నిరంకుశంగా చర్యలు తీసుకుంటేనే.. ఈ అవినీతిని ఆపొచ్చని షీ జిన్‌పింగ్ భావిస్తున్నారట. అందులో భాగంగానే చైనా సైన్యంలో నంబర్ 2గా ఉన్న హీ వీడాంగ్‌పై చర్యలు తీసుకున్నారట.