Pakistan President: పాకిస్తాన్ తదుపరి అధ్యక్షుడు ఎవరు..?

నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి కుర్చీపై కూర్చోవడానికి అంగీకరించారు. అయితే ఇప్పుడు అధ్య‌క్షుడు (Pakistan President) ఎవరు అవుతారనే కొత్త ప్రశ్న తలెత్తుతోంది.

Published By: HashtagU Telugu Desk
Government In Pakistan

Pakistan President: ఫిబ్రవరి 8న జరిగిన ఓటింగ్ తర్వాత పాకిస్థాన్ తదుపరి ప్రధాని ఎవరనేది ఇప్పుడు తేలిపోయింది. వార్తల ప్రకారం.. నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రి కుర్చీపై కూర్చోవడానికి అంగీకరించారు. అయితే ఇప్పుడు అధ్య‌క్షుడు (Pakistan President) ఎవరు అవుతారనే కొత్త ప్రశ్న తలెత్తుతోంది.

బిలావల్ ఎవరిని అధ్య‌క్షుడిని చేయాలనుకుంటున్నారు..?

పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) అధినేత బిలావల్ భుట్టో జర్దారీ తన తండ్రి ఆసిఫ్ అలీ జర్దారీకి అధ్యక్ష పదవి ఇవ్వాలని కోరుతున్నారు. ఇంతకుముందు ఆసిఫ్ అలీ ఈ పదవిలో ఉన్నారు. గత మంగళవారం విలేకరుల సమావేశంలో బిలావల్ ప్రభుత్వంలో భాగం కాకుండా నవాజ్ షరీఫ్‌కు మద్దతు ఇస్తామని చెప్పారు.

ఆసిఫ్ మాత్రమే సంక్షోభం నుండి బయట‌ప‌డేయ‌గ‌ల‌డు

ఆసిఫ్‌ అలీని రాష్ట్రపతిని చేయాలనే డిమాండ్‌పై బిలావల్‌ మాట్లాడుతూ.. ఆయన నా తండ్రి కాబట్టి నేను ఈ విషయం చెప్పడం లేదని అన్నారు. ఈ సమయంలో మన దేశం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్లిష్ట పరిస్థితి నుండి ఎవరైనా మనల్ని గట్టెక్కించగలరంటే అది ఆసిఫ్ అలీ జర్దారీ కాబట్టి నేను ఈ మాట చెప్తున్నానని పేర్కొన్నాడు.

Also Read: Congress: కాంగ్రెస్ పార్టీ పై గులాం న‌బీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు

దేశ ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికల ఫలితాలు ఆమోదించబడ్డాయి

మంత్రిపదవిపై మాకు ఆసక్తి లేదని మా పార్టీ నిర్ణయించిందని బిలావల్ చెప్పారు. అయితే దేశంలో రాజకీయ సంక్షోభం పరిస్థితి తీవ్రంగా మారడం కూడా మేం కోరుకోవడం లేదు. ఎన్నికల ఫలితాలపై మా పార్టీ ఆందోళన చెందుతోందని, అయితే దేశ ప్రయోజనాల దృష్ట్యా అందుకు అంగీకరించాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.

We’re now on WhatsApp : Click to Join

వచ్చే నెలలో రాష్ట్రపతి పదవి ఖాళీ కానుంది

ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీ పదవీ కాలం వచ్చే నెలతో ముగియనుంది. ఆర్థిక, రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాకిస్థాన్‌లో ఫిబ్రవరి 8న ఓటింగ్ జరిగిన విష‌యం తెలిసిందే. ఇందులో జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతు పొందిన స్వతంత్ర అభ్యర్థులు అత్యధిక స్థానాలను కైవసం చేసుకున్నారు.

  Last Updated: 16 Feb 2024, 07:18 AM IST