Monkeypox – Sexual : ప్రకృతి విరుద్ధమైన సెక్స్‌తోనూ ‘మంకీపాక్స్’ : డబ్ల్యూహెచ్ఓ

Monkeypox - Sexual : ఆఫ్రికా దేశం కాంగోలో మంకీపాక్స్ ఆందోళన రేకెత్తించే రీతిలో వేగంగా వ్యాపిస్తోంది.

  • Written By:
  • Publish Date - November 25, 2023 / 01:39 PM IST

Monkeypox – Sexual : ఆఫ్రికా దేశం కాంగోలో మంకీపాక్స్ ఆందోళన రేకెత్తించే రీతిలో వేగంగా వ్యాపిస్తోంది. ఈనేపథ్యంలో దడ పుట్టించే ఒక విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. కాంగోలో ప్రస్తుతం లైంగికంగా కూడా మంకీపాక్స్ వ్యాపిస్తోందని ధృవీకరించింది. బెల్జియంకు చెందిన ఒక వ్యక్తి ఈ ఏడాది మార్చిలో కాంగోకు వెళ్లాడని.. అక్కడికి వెళ్లిన కొన్ని వారాలకే అతడికి  మంకీపాక్స్ పాజిటివ్ నిర్ధారణ అయిందని  డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అతడు కాంగోకు వెళ్లిన తర్వాత కొంతమంది గే (స్వలింగ సంపర్కులు), బై సెక్సువల్స్ (ద్విలింగ సంపర్కులు) వ్యక్తులతో లైంగికంగా కలిశాడని.. ఆ తర్వాతే మంకీపాక్స్ పాజిటివ్ వచ్చిందని పేర్కొంది. ఈ కేస్ స్టడీని బట్టి లైంగికంగా మంకీపాక్స్ సంక్రమిస్తోందనే ధ్రువీకరణకు తాము వచ్చామని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది.

We’re now on WhatsApp. Click to Join.

సెక్సువల్‌గానూ మంకీపాక్స్ వ్యాపిస్తున్నందున.. దాన్ని ఆపడం కష్టతరంగా మారిందని ఆఫ్రికా శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాంగోలో పెరుగుతూపోతున్న గే కల్చర్, బై సెక్సువల్ కల్చర్ ఈ తరహా అంటువ్యాధులకు ఆజ్యం పోస్తోందని డబ్ల్యూహెచ్ఓ ఆందోళన వ్యక్తం చేసింది. ఆఫ్రికా ఖండంలోని దేశాలతో పాటు ఐరోపాలోని దేశాలలోనూ ఈ తరహా ప్రకృతి విరుద్ధమైన సెక్స్ కల్చర్ పెరుగుతుండటం ఆందోళన రేకెత్తించే అంశమని తెలిపింది. ఈ సంవత్సరం కాంగోలో 12,500 మందికి మంకీపాక్స్ సోకగా, వారిలో 580 మంది చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (Monkeypox – Sexual) వివరించింది.

Also Read: Rahul Dravid: లక్నో మెంటర్ గా రాహుల్ ద్రవిడ్..!