Pak Army Chief: పాక్ ఆర్మీ చీఫ్ ఏమయ్యాడు ? బంకర్‌లో దాక్కున్నాడా ?

వారం క్రితమే ఆసిమ్ మునీర్(Pak Army Chief) భారత్‌పై విషం కక్కాడు. కశ్మీరును వదులుకునే ప్రసక్తే లేదన్నాడు.

Published By: HashtagU Telugu Desk
Pakistan Army Chief Asim Munir Pak Pmo Abbottabad

Pak Army Chief:  పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌ ఎక్కడ ? అతడు ఏమయ్యాడు ? భారత్‌తో యుద్ధం జరిగే అవకాశాలున్న ప్రస్తుత తరుణంలో ఆసిమ్ మునీర్ ఎక్కడికి వెళ్లాడు ?  అనే దానిపై అంతటా చర్చలు జరుగుతున్నాయి. ఆసిమ్ మునీర్‌ కనిపించడం లేదంటూ పాక్ మీడియాలో కథనాలు కూడా చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే తన ఫ్యామిలీని ఫారిన్‌కు పంపించిన ఆసిమ్.. ఇప్పుడు తాను కూడా బిచాణా ఎత్తేసి ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. భారత్‌లోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగినప్పటి నుంచి పాకిస్తాన్‌లో ఆసిమ్ మునీర్‌ కనిపించడం లేదని అంటున్నారు. బహుశా పాకిస్తాన్ సైన్యంలోని అసమ్మతి వర్గం అతడిని అదుపులోకి తీసుకొని ఉండొచ్చని అంటున్నారు.

Also Read :Sea Blockade : పాక్‌కు దడపుట్టిస్తున్న భారత నౌకాదళం.. ఎలా ?

తనపై వ్యతిరేకతను తగ్గించుకునేందుకే.. 

వారం క్రితమే ఆసిమ్ మునీర్(Pak Army Chief) భారత్‌పై విషం కక్కాడు. కశ్మీరును వదులుకునే ప్రసక్తే లేదన్నాడు. అతడు ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని రోజులకే పహల్గాం ఉగ్రదాడి జరిగింది. దీంతో ఆసిమ్ మునీర్ గీసిన స్కెచ్‌లో భాగంగానే పహల్గాంలో ఉగ్రదాడి జరిగిందనే టాక్ మొదలైంది. ఆర్మీ చీఫ్ హోదాలో ఉన్నప్పటికీ..  పాకిస్తాన్ ఆర్మీ నుంచి ఆసిమ్ మునీర్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడు. ఈ వ్యతిరేకతను తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగానే అతడు కశ్మీరులో ఉగ్రదాడిని చేయించాడని అంటున్నారు. తన పదవిని కాపాడుకునే ప్రయత్నంలో యావత్ పాకిస్తాన్‌ను పెద్ద అగాధంలోకి ఆసిమ్ మునీర్ నెట్టాడు. పాకిస్తాన్ ప్రజల చూపును తనపై నుంచి మళ్లించడానికే.. కశ్మీరులో టెర్రర్ ఎటాక్‌కు ఆసిమ్ వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. ఈవిషయాన్ని అక్కడి ఆర్మీ, ప్రజలు ఇప్పటికే గ్రహించారు. ఈనేపథ్యంలో ఆసిమ్ మునీర్ స్వయంగా మాయమయ్యాడా ? ఎవరైనా మాయం చేయించారా ? అనేది తెలియాల్సి ఉంది.

Also Read :BRS Meeting : బీఆర్ఎస్ రజతోత్సవంలో కవితకు దక్కని ప్రయారిటీ !

పాక్ పీఎంఓ ఏం చేసిందంటే.. 

ఆసిమ్ మునీర్‌ పాకిస్తాన్‌లోని రావల్పిండిలో ఉన్న  బంకర్‌లో దాచుకున్నాడని పలువురు చెబుతున్నారు. ఈనేపథ్యంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) నష్టనివారణ చర్యలకు దిగింది. పాకిస్తాన్ ప్రజలకు భరోసా ఇచ్చేందుకు ఎక్స్ వేదికగా ఒక పోస్టు పెట్టింది. ప్రధానమంత్రి షహబాజ్‌ షరీఫ్, ఉన్నత సైనికాధికారులతో ఆసిమ్ మునీర్‌ శనివారం రోజు  దిగిన గ్రూప్‌ ఫొటోను ఆ పోస్టులో జతపర్చింది.అయితే ఆ ఫొటో పాతదని కొంతమంది అంటున్నారు. పాక్‌ సైన్యంలోని ఉన్నతాధికారులు రహస్యంగా దేశం నుంచి పారిపోయారని ఓ వర్గం మీడియాలో కథనాలు వస్తున్నాయి.

  Last Updated: 28 Apr 2025, 10:33 AM IST