China Foreign Minister Missing : ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ పై డిబేట్ జరుగుతోంది.
కీలకమైన ఒక వ్యక్తి మిస్సింగ్ పై అంతటా సస్పెన్స్ నెలకొంది..
జూన్ 18 వరకు అందరికీ కనిపించిన ఆ వరల్డ్ క్లాస్ వీఐపీ .. గత 3 వారాలుగా ఏమయ్యాడో తెలియడం లేదు..
అతడు ఎవరు ? ఆ మిస్టరీ ఏమిటి ?
చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ ఎక్కడ ?
సరిగ్గా నెల క్రితం జూన్ 18న చైనా రాజధాని బీజింగ్‌లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తో ఆయన భేటీ అయ్యారు.. జూన్ 25న బీజింగ్‌లోనే శ్రీలంక విదేశాంగ మంత్రి అలీ సబ్రీ, వియత్నాం విదేశాంగ మంత్రి బుయ్ థాన్ సన్‌లతోనూ క్విన్ గ్యాంగ్ సమావేశమయ్యారు. ఆయనకు అవే చివరి మీటింగ్స్ అయ్యాయి.. ఆ తర్వాత చైనా విదేశాంగ మంత్రి ఏమయ్యారు ? ఆ మీటింగ్ లో ఆరోగ్యంగా కనిపించిన 57 ఏళ్ళ క్విన్ గ్యాంగ్ కు అంతలోనే ఏమైంది ? ఆయన మిస్సింగ్ కు కారణం ఆరోగ్య సమస్యలా ? ఇంకా ఏదైనా జరిగిందా ? అనే అంశాలపై ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా రకరకాల న్యూస్ స్టోరీస్ ను వండి వారుస్తోంది.
జూన్ 18న బీజింగ్‌లో అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ తో భేటీ అయిన చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్
Also read : Delhi Liquor Scam : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాగుంట రాఘవకు బెయిల్ మంజూరు
గత వారం ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరిగిన తూర్పు ఆసియాన్ దేశాల విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశానికి చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ బదులు సీనియర్ కమ్యూనిస్టు పార్టీ నేత క్విన్ బాస్ ను చైనా ప్రభుత్వం పంపించింది. ఆయనే మన ఇండియా విదేశాంగ మంత్రి జైశంకర్ తో భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. ఈ పరిణామం అందరినీ ఆశ్చర్యపర్చింది. ప్రత్యేకించి ఈ పరిణామం అమెరికాకు షాక్ ఇచ్చింది. ఎందుకంటే.. ఆ దేశ విదేశాంగ మంత్రితో చర్చలు జరిపిన వారం తర్వాతి నుంచి చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ అడ్రస్ లేకుండా పోయారు. క్విన్ గ్యాంగ్ అస్వస్థతకు గురవడం వల్లే తూర్పు ఆసియా దేశాల విదేశాంగ మంత్రుల స్థాయి మీటింగ్ కు హాజరు కాలేదని చైనా చెప్పినా .. ఆ ప్రకటన నమ్మేలా లేదని మీడియాలో స్టోరీస్ వస్తున్నాయి. మరి ఇంతకూ చైనా విదేశాంగ మంత్రి మిస్సింగ్ కు దారితీసిన కారణం ఏమిటి ?
Also read : Dhoni Garage Video: వైరల్ అవుతున్న ధోనీ గ్యారేజీ వీడియో
హాంకాంగ్‌కు చెందిన టీవీ జర్నలిస్ట్ ఫు జియోటియన్‌తో చైనా విదేశాంగ మంత్రి 57 ఏళ్ళ క్విన్ గ్యాంగ్ కు ఉన్న ఎఫైర్ వ్యవహారంతో ఈ మిస్సింగ్ కు ముడిపెడుతూ కొన్ని సంచలన న్యూస్ స్టోరీస్ పబ్లిష్ అయ్యాయి. వాటి ప్రకారం.. హాంకాంగ్ కేంద్రంగా పనిచేసే Phoenix TVలో జర్నలిస్టుగా ఫు జియోటియన్ పనిచేస్తోంది. ఆమెతో క్విన్ గ్యాంగ్ కు ఎఫైర్ ఉందని ఆ స్టోరీలో ప్రస్తావించారు. అమెరికా పౌరసత్వం కలిగిన ఫు జియోటియన్‌తో చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ కు వివాహేతర సంతానం ఉన్నారనే విషయం చైనా ప్రభుత్వానికి తెలిసిందని వివాదాస్పద న్యూస్ స్టోరీస్ లో పేర్కొన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన చైనా ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు విదేశాంగ మంత్రిని అదుపులోకి తీసుకున్నాయని ఆ కథనాల్లో తెలిపారు. అయితే ఈ వార్తలను చైనా ప్రభుత్వం కానీ.. చైనా విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ కానీ ఇంకా ధృవీకరించలేదు లేదా ఖండించలేదు. ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారని చైనా ప్రకటించిన విషయం కూడా నిజమై ఉండొచ్చు. ఒకవేళ ఇంకొన్ని వారాలైనా క్విన్ గ్యాంగ్ మీడియా ముందుకు రాకుంటే.. ఈ సస్పెన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉంది. చైనా మంత్రులు అకస్మాత్తుగా అదృశ్యం కావడం ఇదే మొదటిసారేం కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. అవినీతి, కుంభకోణాలు వంటి కారణాలతో చాలామంది మంత్రులను సడెన్ గా చైనా ప్రభుత్వం జైల్లో వేసింది.