Israel Vs Iran : దాదాపు 200 మిస్సైళ్లతో మంగళవారం అర్ధరాత్రి ఇరాన్ చేసిన దాడికి ప్రతీకారం తీర్చుకునే పనిలో ఇజ్రాయెల్ నిమగ్నమైంది. ఇంతకీ ఇజ్రాయెల్ ఏం చేయబోతోంది ? ఇరాన్‌లోని ఏయే టార్గెట్‌లపై దాడులు చేయబోతోంది ? ఏయే నేతలను అంతం చేయబోతోంది ? అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
Also Read :Helicopter Crash : కొండల్లో కూలిన హెలికాప్టర్.. ముగ్గురి మృతి
ఇరాన్ వెన్ను విరిచేలా తన ప్రతీకార దాడులు ఉండాలని ఇజ్రాయెల్ భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్లాన్ ఇప్పటికే రెడీ అయినట్లు సమాచారం. అయితే దాడి చేసే సమయాన్ని ఇప్పుడే చెప్పేది లేదని ఇజ్రాయెల్(Israel Vs Iran) అంటోంది. ఎప్పుడు దాడి చేయాలనేది తమ ఇష్టమని చెబుతోంది. తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని తేల్చి చెబుతోంది.
ఇరాన్‌లోని ఇజ్రాయెల్ టార్గెట్స్ ఇవీ..
- అణ్వాయుధాల తయారీ కోసం ఇరాన్ ముమ్మరంగా ప్రయోగాలు చేస్తోంది. అయితే ఇరాన్ ఎక్కడెక్కడ అణ్వాయుధ ప్రయోగాలు చేస్తోందనే సమాచారం ఇజ్రాయెల్ వద్ద ఉంది. ఆయా ప్రదేశాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసే ముప్పు ఉంది. ఇజ్రాయెల్ మాజీ ప్రధానమంత్రి నెఫ్తలీ బెన్నెట్ ఈవిషయాన్ని తెలుపుతూ ఎక్స్ వేదికగా ఒక పోస్టు చేశారు.
- ఇరాన్‌లోని ప్రధాన విద్యుత్తు కేంద్రాలు, ఆయిల్ రిఫైనరీలు, చమురు ఉత్పత్తి పరిశ్రమలు, గ్యాస్ పైప్ లైన్లపై ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉంది.
- ఇరాన్‌లోని మిస్సైళ్లు, రాకెట్లు, యుద్ధ విమానాల తయారీ యూనిట్లు పెద్దసంఖ్యలో ఉన్నాయి. వాటిపైనా ఇజ్రాయెల్ ఎటాక్ చేసే ముప్పు ఉంది.
- ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, అధ్యక్షుడు పెజెష్కియాన్ ఉంటున్న నివాసాలు, రహస్య బంకర్లు లక్ష్యంగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసే ఛాన్స్ ఉంది.
- ఇరాన్‌కు సంబంధించిన టెలీ కమ్యూనికేషన్ టవర్లు, బ్యాంకింగ్ వ్యవస్థలపైనా ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశం ఉంది.
- ఇరాన్ ఆర్మీకి చెందిన ట్రైనింగ్ సెంటర్లు, మిస్సైల్ లాంచింగ్ ప్యాడ్లపైనా ఇజ్రాయెల్ ఎటాక్ చేసే ఛాన్స్ ఉంది.