Site icon HashtagU Telugu

ISIS K : రష్యాలో 60 మందిని చంపిన ‘ఐసిస్-కే’.. ఏమిటిది ?

Isis K

Isis K

ISIS K : రష్యా రాజధాని మాస్కోలో ఉన్న క్రాకస్‌ సిటీ కన్సర్ట్‌ హాల్‌‌పై ఉగ్రదాడి చేసింది తామే అని ఐసిస్-కే (ISIS-K) ప్రకటించింది. ఈ దాడిలో  60 మంది మృతిచెందగా, 100 మందికిపైగా గాయపడ్డారు. ‘ఐసిస్-కే’ అంటే.. ఇస్లామిక్ స్టేట్ ఖొరాసన్ !! ఇది ఐసిస్ ఉగ్ర సంస్థ ఆఫ్ఘన్ శాఖ !! రష్యాపై దాడి ‘ఐసిస్-కే’ ఉగ్ర సంస్థ పనే అని అమెరికాకు చెందిన ఆర్మీ ఇంటెలీజెన్స్ విభాగం తెలిపింది. ఇంతకీ ‘ఐసిస్-కే’ ఏమిటి ? ఎందుకీ దాడి చేసింది.. చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join

‘ఇస్లామిక్ స్టేట్ – ఖొరాసన్’ (ISIS-K) ఉగ్రసంస్థ  ఇరాన్, తుర్క్‌మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్‌లలోని సరిహద్దు ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తుంటుంది. ఈ మూడు దేశాల సరిహద్దు ప్రాంతాన్ని ఖొరాసన్ అని పిలుస్తుంటారు. ఇది 2014 చివర్లో తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో ఉద్భవించింది.  ఇది క్రూరత్వానికి కేరాఫ్ అడ్రస్. 2018 సంవత్సరం నుంచి ISIS-Kలో ఉగ్రవాదుల చేరికలు తగ్గాయి. ఈ ఉగ్రసంస్థ వల్ల  ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్, అమెరికా దళాలు అప్పట్లో భారీ నష్టాలను చవిచూశాయి. 2021లోఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా ఆర్మీ వెళ్లిపోయింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లోని సరిహద్దు ప్రాంతాల్లో ఐఎస్‌ఐఎస్-కెకు అడ్డు లేకుండాపోయింది.

Also Read : 60 Killed : 60 మంది మృతి, 100 మందికి గాయాలు.. రష్యా రాజధాని మాస్కోపై ఉగ్రదాడి

Also Read : Trump Link : మాస్కో ఉగ్రదాడి.. తెరపైకి ట్రంప్ పేరు.. ఎందుకు ?

ఇటీవల కాలంలో ఐసిస్-కే  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై వ్యతిరేకతను పెంచుకుంది. తరుచూ పుతిన్‌ను విమర్శిస్తూ.. అది ప్రకటనలను విడుదల చేస్తోంది. ముస్లింలను అణచివేసే అంతర్జాతీయ కార్యకలాపాలలో రష్యా భాగస్వామిగా ఉందని ఐసిస్-కే అంటోంది.  ఆసియా ప్రాంతానికి చెందిన ఎంతోమంది ఐసిస్-కేలో ఉన్నారని అమెరికాకు చెందిన రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. ఐసిస్-కే రష్యా వ్యతిరేక వైఖరిని తీసుకుందంటే.. అమెరికాను సపోర్ట్ చేస్తోందా ? అమెరికా నుంచి సపోర్టు తీసుకుంటోందా ? అనే సందేహాలు తలెత్తుతున్నాయి.

Also Read : Vundavalli Sridevi : ఉండవల్లి శ్రీదేవికి బాబు వెన్నుపోటు..?