Site icon HashtagU Telugu

Blast in Mali : జిహాదీ తిరుగుబాటుదారుల బస్సు లక్ష్యంగా భారీ పేలుడు…11 మంది మృతి.. 53 మందికి గాయాలు..!!

China Explosion

Bomb blast

మాలిలో భారీ పేలుడు సంభవించింది. 11 మంది ప్రాణాలు కోల్పోగా… 53 మంది గాయపడ్డారు. సెంట్రల్ మాలిలో గురువారం బస్సులో పేలుడు సంభవించిందని AFFI వార్తా సంస్థ వర్గాలు తెలిపాయి. మోప్టి ప్రాంతంలోని బండియాగరా, గౌండ్కా మధ్య రహదారిపై గురువారం మధ్యాహ్నం బస్సులో పేలుడు సంభవించినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. జిహాదీల హింసాకాండకు కేంద్రంగా పేరొందిన ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నివేదికల ప్రకారం బస్సులో ఉన్నవారంతా సాధారణ పౌరులు. ఒక దశాబ్దానికి పైగా, మాలి సాయుధ తిరుగుబాటు గ్రూపుల కార్యకలాపాలను నియంత్రించడానికి పోరాడుతోంది. మాలిలో జిహాదీ తిరుగుబాటుదారులు ఇప్పటివరకు వేలాది మందిని చంపారు.