Site icon HashtagU Telugu

NRI Family: అమెరికాలో ఎన్ఆర్ఐ కుటుంబం అనుమానాస్పద మృతి.. కాల్చేశారా?

us family dead

us family dead

NRI Family: అమెరికాలో ఉంటోన్న ఎన్ఆర్ఐ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. రాకేష్ కమల్ (57), భార్య టీనా (54) కుమార్తె అరియానా (18) మృతదేహాలు గురువారం రాత్రి 7.30 గంటలకు డోవర్ లోని ఖరీదైన భవనంలో కనిపించాయని నార్ఫోక్ డిస్ట్రిక్ట్ అటార్నీ (డీఏ) మైఖేల్ మోరిస్సే తెలిపారు.

వారందరివీ అనుమానాస్పద మరణాలుగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాకేష్ కమల్ మృతదేహం వద్ద ఒక తుపాకీని గుర్తించారు. రాకేష్ ఆ గన్ తో భార్య, కూతురిని కాల్చి చంపి.. ఆపై తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. రెండురోజులుగా కుటుంబ సభ్యుల నుంచి సమాచారం లేకపోవడంతో.. వారి ఇంటికి వెళ్లగా మృతదేహాలు కనిపించాయని.. జిల్లా అటార్నీ వెల్లడించారు.

రాకేశ్ కమల్, ఆయన భార్య టీనా ఎడ్యునోవా అనే ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కంపెనీని నిర్వహించేవారు. 2016లో ప్రారంభమైన ఈ కంపెనీలు 2021 డిసెంబర్ లో మూతపడినట్లు ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. ఆ కంపెనీకి టీనా కమల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా వ్యవహరించారు. ఆమె ఢిల్లీ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీల్లో విద్యను అభ్యసించారు. కమల్ బోస్టన్ యూనివర్సిటీ, ఎంఐటి స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్, స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో విద్యను అభ్యసించారు. వారి కుమార్తె అరియానా వెర్మాంట్ లోని ప్రైవేట్ లిబరల్ ఆర్ట్స్ స్కూల్ మిడిల్ బరీ కాలేజీలో చదువుతోంది. కొంతకాలంగా వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు ఆన్లైన్ రికార్డులు చెబుతున్నాయి.

 

Exit mobile version