PM Modi: పశ్చిమాసియాలో యుద్ధం మొదలై నేటికి 24వ రోజు. లోక్‌సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పశ్చిమాసియా పరిస్థితులపై ప్రసంగించారు. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. గత రెండు మూడు వారాలుగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్, కేంద్ర మంత్రి హర్దీప్ పూరి సభకు ఈ పరిస్థితిపై వివరణాత్మక నివేదికలను అందించారని గుర్తు చేశారు. ఈ సంఘర్షణ మూడు వారాలకు పైగా కొనసాగుతోందని, ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని, అందుకే ప్రపంచ దేశాలన్నీ శాంతియుత పరిష్కారం కోసం అన్ని పక్షాలను కోరుతున్నాయని ఆయన అన్నారు.
భారతీయుల భద్రత, తరలింపు
పశ్చిమాసియా సంఘర్షణపై ప్రధాని మోదీ మాట్లాడుతూ.. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ప్రభావిత దేశాల్లో ఉన్న ప్రతి భారతీయుడికి సహాయం అందించామని తెలిపారు. “నేను పశ్చిమాసియాలోని మెజారిటీ దేశాల అధినేతలతో రెండుసార్లు ఫోన్ ద్వారా మాట్లాడాను. భారతీయుల భద్రతపై వారందరూ హామీ ఇచ్చారు. ఈ యుద్ధంలో కొందరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు గాయపడ్డారు” అని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారతదేశం 41 దేశాల నుండి ఇంధన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటోందని వెల్లడించారు.
Also Read: ఐపీఎల్ 2026.. ఉచితంగా మ్యాచ్‌లు చూసేందుకు సిద్ధమవ్వండి!
#WATCH | On the West Asia conflict, Prime Minister Narendra Modi says, "The situation in West Asia is worrisome. In the last 2-3 weeks, EAM Dr S Jaishankar and Union Minister Hardeep Puri have provided the details of the situation to the House. This conflict has been going on for… pic.twitter.com/glAmgzVDyP
— ANI (@ANI) March 23, 2026
సందర్భానుసారంగా ప్రధాని అందించిన కీలక గణాంకాలు
సురక్షితంగా భారత్‌కు: యుద్ధం మొదలైనప్పటి నుండి 3,75,000 మందికి పైగా భారతీయులు సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారు.
ఇరాన్ నుండి: ఇరాన్ నుండి ఇప్పటివరకు దాదాపు 1,000 మంది భారతీయులు తిరిగి వచ్చారు. వీరిలో 700 మందికి పైగా మెడికల్ విద్యార్థులు ఉన్నారు.
పరీక్షల రద్దు: ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని గల్ఫ్ దేశాల పాఠశాలల్లో 10, 12వ తరగతి పరీక్షలను CBSE రద్దు చేసింది. విద్యార్థుల చదువుకు ఆటంకం కలగకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఇంధన సరఫరా, ఆర్థిక ప్రభావం
పెద్ద మొత్తంలో ముడి చమురు, గ్యాస్, ఎరువులు, అనేక నిత్యావసర వస్తువులు హోర్ముజ్ జలసంధి మార్గం ద్వారా భారతదేశానికి వస్తాయని ప్రధాని వివరించారు. యుద్ధం కారణంగా ఈ మార్గంలో నౌకల రాకపోకలు అత్యంత సవాలుగా మారాయని, అయినప్పటికీ దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావం పడకుండా ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.
ముఖ్యంగా దేశీయ ఎల్‌పీజీ (LPG) అవసరాలలో 60% దిగుమతులపైనే ఆధారపడి ఉన్నాము.
సరఫరాలో అనిశ్చితి ఉన్నందున, ప్రభుత్వం గృహ వినియోగదారులకు ప్రాధాన్యతనిస్తోంది.
దేశీయంగా ఎల్‌పీజీ ఉత్పత్తిని పెంచుతున్నామని, దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ సరఫరా సజావుగా సాగుతోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
