Site icon HashtagU Telugu

Russia: ఉక్రెయిన్‌తో యుద్దం.. రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన వ్యాఖ్యలు

124955610 Putin

124955610 Putin

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్దం ఇంకా ఆగిపోవడం లేదు. గత 10 నెలలకుపైగా కొనసాగుతూనే ఉంది. యుద్దం రోజురోజుకు ముదిరిపోతుంది. ఎంతగా చర్చలు జరిగినా యుద్దం ఇంకా సమసిపోవడం లేదు. ఈ భీకర యుద్దం వల్ల రెండు దేశాలకు నష్టం చేకూరింది. భారీగా ఆర్ధిక ప్రాణ,ఆస్తి నష్టం జరుగుతోంది. శాంతి చర్చలకు రెండు దేశాల మధ్య జరక్కపోవడంతో యుద్దం కొనసాగుతూనే ఉంది.

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ద వాతావరణం ఇప్పటికీ నెలకొంది. ఇది ఎప్పుడు ముగిసిపోతుందనేది ఎవరికీ అర్ధం కావడం లేదు. అయితే తాజగా యుద్దంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేసింది. వెస్ట్రన్ దేశాలు రష్యాను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రయిన్ కూడా రష్యన్లు అని, రష్యన్లను ఏకం చేయడానికి యుద్దం అని తెలిపారు. ఉక్రయిన్ యుద్దాన్ని వ్లాదిమిర్ పుతిన్ సమర్థించారు.

విభజించి జయించాలని వెస్ట్రన్ దేశాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయని పుతిన్ ఆరోపించారు. రష్యాలోని తమ రాజకీయ ప్రత్యర్థులు దేశాన్ని ముక్కలు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, వారి కోరికలు నెరవేరవని తెలిపారు. జాతీయ, పౌరుల ప్రయోజనాలను కాపాడేందుకే తాము కృషి చేస్తున్నామని, తమ లక్ష్యం రష్యన్ ప్రజలను ఏకం చేయడమేనని తెలిపారు. తమ ప్రభుత్వం సరైన దిశలో పయనిస్తుందన్నారు. ఉక్రెయిన్ తో శాంతి చర్చలకు తాము సిద్దం ఉన్నామని పుతిన్ స్పష్టం చేశారు.

అమెరికా నుంచి ఉక్రెయిన్ పొందుతున్న పేట్రియాట్ క్షిపణి వ్యవస్ధను 100 శాతం నాశనం చేస్తామని పుతిన్ చెప్పారు. అయితే ఇటీవల ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ అమెరికాను ఆశ్రయించి యుద్దంలో సైనిక సాయాన్న కోరాడు. దీంతో ఉక్రెయిన్ కి అమెరికాతో పాటు పలు దేశాలు సహాయసహకారులు అందిస్తున్నాయి. ఈ క్రమంలో పుతిన్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి.

Exit mobile version