Site icon HashtagU Telugu

Mother Heroine Award: 10 మంది పిల్లలున్నారా.. అయితే రూ.13 లక్షల మీవే..!

Putin Agrees To China Visit

Putin

మదర్‌ హీరోయిన్‌ అవార్డు కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసేందుకు రష్యా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చి, పెంచిన తల్లులకు ‘మదర్‌ హీరోయిన్‌’ అవార్డును అధ్యక్షుడు పుతిన్‌ ప్రదానం చేయనున్నారు. అలాగే రూ.13 లక్షల నగదును అందిస్తారు. ఈ అవార్డు 1996-94 మధ్య కాలంలో ఉండగా, ఆ తర్వాత ఆపేశారు. కొన్నినెలల కిందటే దాన్ని పునరుద్ధరించగా, తాజాగా అవార్డులను ఇవ్వడం మొదలుపెట్టారు.

కొన్నినెలల కిందట రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ దీన్ని మళ్లీ పునరుద్ధరించగా తాజాగా అవార్డులను ప్రదానం చేయడం మొదలుపెట్టారు. ఈ అవార్డు పొందాలంటే వాళ్లు రష్యా ఫెడరేషన్ పౌరులై ఉండాలి. 10వ శిశువు ఫస్ట్ బర్త్ డే తర్వాత ఈ రివార్డు అందుకునేందుకు మహిళలు అర్హత సాధిస్తారు. ఈ అవార్డు గ్రహీతల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ స్నేహితుడు రమ్‌జాన్ కదిరోవ్ భార్య మెద్నీ కూడా ఉన్నారు. ఏ మ‌హిళైనా క‌నీసం 10 మంది పిల్లల‌కు జ‌న్మనిస్తే.. ఆ మ‌హిళ‌కు రష్యా కరెన్సీలో రూ.13 లక్షల నగదును బ‌హుమ‌తిగా ఇస్తామ‌ని పుతిన్ ప్రక‌టించారు.

కోవిడ్ మహమ్మారి తర్వాత రష్యా, ఉక్రెయిన్‌తో యుద్ధంలో చిక్కుకుంది. ప్రధానంగా ఈ రెండు కారణాల వల్ల దేశ జనాభా బాగా తగ్గిపోయింది. దేశాన్ని జనాదరణ పొందేందుకు గత ఆగస్టులో రష్యా ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక ప్రకటన చేసింది. పది లేదా అంతకంటే ఎక్కువ పది మంది పిల్లల తల్లులకు నగదు బహుమతి లభిస్తుంది. కానీ.. 1 మిలియన్ రూబిళ్లు లేదా 13 లక్షల రూపాయలతో పది మంది పిల్లలను పెంచడం సాధ్యమేనా? రష్యా ఆర్థిక వ్యవస్థపై యుద్ధం ఇప్పటికే భారీ నష్టాన్ని చవిచూసింది. అలాంటప్పుడు ఇంత మంది పిల్లలను ఆదుకోవడం ఎలా సాధ్యం? పైగా ఒక స్త్రీ ఇంతమంది పిల్లలకు జన్మనివ్వడం శారీరకంగా సాధ్యమేనా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.