Site icon HashtagU Telugu

Vladimir Putin China Visit: అక్టోబర్‌లో చైనాలో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు.. స్వయంగా ప్రకటించిన పుతిన్..!

Independent Candidate Putin

Putin Agrees To China Visit

Vladimir Putin China Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అక్టోబర్‌లో చైనా (Vladimir Putin China Visit)లో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ధృవీకరించారు. అక్టోబర్‌లో చైనాలో పర్యటించాలన్న చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ ఆహ్వానాన్ని తాను అంగీకరించినట్లు పుతిన్‌ బుధవారం (సెప్టెంబర్‌ 20) తెలిపారు. రష్యా ప్రభుత్వ టెలివిజన్‌లో జరిగిన సమావేశంలో పుతిన్.. బీజింగ్ విదేశాంగ మంత్రి వాంగ్ యితో మాట్లాడుతూ.. “అక్టోబర్‌లో చైనాను సందర్శించాలని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షుడి ఆహ్వానాన్ని అంగీకరించడం నాకు సంతోషంగా ఉంది”అని అన్నారు. బీజింగ్ చేరుకున్న తర్వాత పుతిన్ చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ను కలుస్తారు. ఉక్రెయిన్ నుంచి పిల్లలను అక్రమంగా బహిష్కరించినందుకు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత పుతిన్ చేస్తున్న తొలి విదేశీ పర్యటన ఇది.

రష్యా పర్యటనలో చైనా విదేశాంగ మంత్రి

చైనా అత్యున్నత దౌత్యవేత్త, విదేశాంగ మంత్రి వాంగ్ యీ రష్యాలో పర్యటించడం గమనార్హం. వాంగ్ యీ నాలుగు రోజుల పర్యటన నిమిత్తం రష్యా వెళ్లారు. అతను వార్షిక వ్యూహాత్మక భద్రతా సంప్రదింపు సమావేశాలలో పాల్గొననున్నాడు. వాంగ్ యితో తన భేటీలో పుతిన్ తన చైనా పర్యటనను ధృవీకరించారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గత మార్చిలో మాస్కో పర్యటన సందర్భంగా పుతిన్‌ను చైనా రావాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. అతని ఆహ్వానం మేరకు రష్యా అధ్యక్షుడు మూడవ బెల్ట్, రోడ్ ఫోరమ్‌లో పాల్గొననున్నారు.

Also Read: Internation Day of Peace : నేడు అంతర్జాతీయ శాంతి దినోత్సవం..!

అరెస్టు భయంతో పుతిన్ విదేశీ పర్యటనలకు దూరంగా ఉన్నారు

గతంలో పుతిన్ విదేశీ పర్యటనలకు దూరంగా ఉండేవారు. ఇటీవల జరిగిన బ్రిక్స్ సమ్మిట్, జి-20 సదస్సులో ఆయన పాల్గొనలేదు. పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసిసి) అరెస్ట్ వారెంట్ జారీ చేసిన తర్వాత, అతను విదేశీ పర్యటనలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అమెరికాకు వ్యతిరేకంగా ఉండే నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఇటీవల రష్యాలో పర్యటించారు. ఉత్తరకొరియా, రష్యాల మధ్య ఆయుధ ఒప్పందం జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.

Exit mobile version