Site icon HashtagU Telugu

Visa Free Entry: అమెరికాకు వీసా లేకుండా ప్రవేశించే జాబితాలోకి ఇజ్రాయెల్

Visa Free Entry

Visa Free Entry

Visa Free Entry: వీసా లేకుండా కొన్ని దేశాలకు పరిమితులతో కూడిన ప్రవేశం ఉంటుంది. అమెరికాకు వీసా లేకుండా ప్రయాణించే జాబితాలో ఇప్పుడు ఇజ్రాయెల్ దేశం ఉండబోతుంది. యుఎస్ విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ మరియు యుఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో మయోర్కాస్ ఈ విషయాన్ని ఆమోదించారు. సో మొత్తానికి ఇజ్రాయెల్ ప్రజలు వీసా లేకుండా అమెరికాలో పర్యటించే అవకాశం ఉంది. గతంలో పాలస్తీనా అమెరికన్ల పట్ల ఆందోళనల కారణంగా ఇజ్రాయెల్ పౌరులకు వీసా రహిత ప్రవేశాన్ని అమెరికా నిలిపివేసింది. అయితే వీసా రహిత ప్రవేశానికి అవసరమైన ఏర్పాట్లకు ఇజ్రాయెల్ అంగీకరించడంతో ఆ దేశం వీసా రహిత ప్రవేశ జాబితాలో చేరింది.

అమెరికాకు వీసా లేకుండా ప్రవేశం ఉన్న దేశాలు:

అండోరా
ఆస్ట్రేలియా
ఆస్ట్రియా
బెల్జియం
బ్రూనై
చిలీ
క్రొయేషియా
చెక్ రిపబ్లిక్
డెన్మార్క్
ఎస్టోనియా
ఫిన్లాండ్
ఫ్రాన్స్
జర్మనీ
గ్రీస్
హంగేరి
ఐస్లాండ్
ఐర్లాండ్
ఇటలీ
జపాన్
లాట్వియా
లిచెన్‌స్టెయిన్
లిథువేనియా
లక్సెంబర్గ్
మాల్టా
మొనాకో
నెదర్లాండ్స్
న్యూజిలాండ్
నార్వే
పోలాండ్
పోర్చుగల్
శాన్ మారినో
సింగపూర్
స్లోవేకియా
స్లోవేనియా
దక్షిణ కొరియా
స్పెయిన్
స్వీడన్
స్విట్జర్లాండ్
తైవాన్
యునైటెడ్ కింగ్‌డమ్
ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ జాబితాలో చేరడంతో మొత్తం జాబితా 41 దేశాలకు విస్తరించింది.

Also Read: Ram Charan : ప్రమాదానికి గురైన హీరో రామ్ చరణ్..?