Site icon HashtagU Telugu

Indians: భారత్, తైవాన్ పర్యాటకులకు థాయ్ లాండ్ లో వీసా ఫ్రీ ఎంట్రీ

Young Indians To Thailand

Young Indians To Thailand

Indians: పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు థాయ్‌లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్, తైవాన్ దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు వీసా ఫ్రీ ఎంట్రీ కల్పించాలని నిర్ణయించారు. నవంబర్ నుంచి వచ్చే ఏడాది (2024) మే వరకు ఈ సడలింపులు అమలులో ఉంటాయని థాయ్ ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. భారతదేశం మరియు తైవాన్ నుండి వచ్చే వారు వీసా లేకుండా 30 రోజుల పాటు థాయ్‌లాండ్‌ను సందర్శించవచ్చని ఆయన చెప్పారు. పర్యాటకులను మరింతగా ఆకర్షించాలనే ఉద్దేశ్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే చైనా, మలేషియా, దక్షిణ కొరియా తర్వాత ఎక్కువ మంది టూరిస్టులు భారత్ నుంచి థాయ్‌లాండ్‌కు వెళుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, థాయ్ ప్రభుత్వం ఇటీవల చైనా పర్యాటకులకు వీసా రహిత ప్రవేశాన్ని అనుమతించింది. ఇప్పుడు తాజాగా భారతదేశం మరియు తైవాన్ ఆ వెసులుబాటును ఇచ్చాయి. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 29 వరకు 22 మిలియన్ల మంది థాయ్‌లాండ్‌ను సందర్శించారు. ఇది 927.5 బిలియన్ భాట్ (25.67 బిలియన్ డాలర్లు) ఆదాయాన్ని ఆర్జించింది. ఈ సంవత్సరం, థాయ్ ప్రభుత్వం 28 మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ క్రమంలోనే తాజా నిర్ణయం తీసుకున్నారు.