Site icon HashtagU Telugu

Zakir Naik : జాకిర్ నాయక్ వర్సెస్ ఒక యువతి.. ఆ ప్రశ్నపై వాడివేడిగా వాగ్వాదం

Zakir Naik Viral Video Pakistani Girl

Zakir Naik : భారత్‌కు చెందిన వివాదాస్పద మత ప్రబోధకుడు జాకిర్ నాయక్ ప్రస్తుతం పాకిస్తాన్ పర్యటనలో ఉన్నారు. ఆయన పాక్‌లోని పలు నగరాల్లో ఇస్లామిక్ మత ప్రచార కార్యక్రమాల్లో ప్రసంగిస్తున్నారు. ఈక్రమంలో ఓ యువతితో జాకిర్ నాయక్‌కు వాడివేడిగా వాగ్వాదం జరిగింది. ఇంతకీ ఆమె ప్రశ్న ఏమిటి ? జాకిర్ నాయక్ చెప్పిన జవాబు ఏమిటి ? ఇప్పుడు తెలుసుకుందాం.

Also Read :Nobel Prize 2024 : విక్టర్ ఆంబ్రోస్, గ్యారీ రువ్‌కున్‌లకు వైద్యశాస్త్రంలో నోబెల్ ప్రైజ్

‘‘మేం ఉండే ప్రాంతంలో ముస్లింలే పెద్దసంఖ్యలో ఉంటారు. అక్కడ డ్రగ్స్ పెద్దఎత్తున వాడుతున్నారు. పిల్లలపై లైంగిక దాడులు జరుగుతున్నాయి. పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఏమంటారు ?’’ అని జాకిర్ నాయక్‌ను సదరు యువతి  ప్రశ్నించింది. అయితే ఈ ప్రశ్నను జాకిర్ నాయక్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి తప్పుడు ప్రశ్న అడిగినందుకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే సదరు యువతి క్షమాపణ చెప్పేందుకు నో చెప్పింది. తన ప్రశ్నలో ఏదైనా లోపం దొర్లి ఉండొచ్చని ఆమె చెప్పింది. దీంతో జాకిర్ నాయక్ (Zakir Naik) కొంత అసహనానికి గురయ్యారు.

‘‘చేసిన తప్పును అంగీకరించాలి. మీరు ఇన్ని వేలమందిలో తప్పుడు ప్రశ్న అడిగారు. మీడియా కూడా మీ ప్రశ్నను రికార్డ్ చేసింది. మీ ప్రశ్న ద్వారా యావత్ సమాజాన్ని బద్నాం చేసేందుకు మీరు ప్రయత్నించారు. అందుకే క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు క్షమాపణ చెప్పకుంటే.. నేను మీ ప్రశ్నకు సమాధానం చెప్పలేను’’ అని జాకిర్ స్పష్టం చేశారు. అయినా సదరు క్షమాపణ చెప్పేందుకు అంగీకరించలేదు.  ఈక్రమంలో జాకిర్ నాయక్ స్పందిస్తూ.. ‘‘మీ ప్రశ్నలోనే రెండు రకాల అభిప్రాయాలు ఉన్నాయి. మీ ప్రాంతంలో ఇస్లాం ఉందని చెబుతున్నారు. పిల్లలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయని అంటున్నారు. ఇవి రెండూ ఒకే చోట అస్సలు ఉండవు. ఎందుకంటే.. ఇస్లాం అందుకు అనుమతించదు. పిల్లలను వేధించమని ఇస్లామిక్ గ్రంథాలలో ఎక్కడా రాసిలేదు’’ అని తేల్చి చెప్పారు. సమాజంపై తప్పుడు వైఖరితో ఆలోచించడం ఇక ఆపేయండని  యువతికి జాకిర్ సూచించారు. డ్రగ్స్ వంటి దురలవాట్లకు యువతను దూరం చేసేందుకు ప్రత్యేకంగా మతాలకు అతీతంగా పనిచేయాల్సి ఉంటుందన్నారు.