USA : భార‌త ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌పై అమెరికా మ‌రోసారి ప్ర‌శంస‌లు.. ఢిల్లీ వెళ్లి చూడండంటూ కితాబు..

సోమ‌వారం జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో.. భార‌త్‌లో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌జాస్వామ్యం ఉందా అన్న ప్ర‌శ్న‌కు శ్వేత‌సౌధం జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హామండ‌లి స‌మ‌న్వ‌య‌క‌ర్త జాన్ కెర్బీ(John Kirby) మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

Published By: HashtagU Telugu Desk
USA John Kirby Praised Indian Democracy and PM Modi

USA John Kirby Praised Indian Democracy and PM Modi

భార‌త(India) ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌పై అమెరికా(America) ప్ర‌భుత్వం మ‌రోసారి ప్ర‌శంస‌లు కురిపించింది. భార‌త్‌లో చైత‌న్య‌వంత‌మైన ప్ర‌జాస్వామ్యం ఉంద‌ని తెలిపింది. ఎవ‌రైనా న్యూఢిల్లీ(New Delhi)కి వెళితే దానిని చూడొచ్చ‌ని తెలిపింది. సోమ‌వారం జ‌రిగిన విలేక‌రుల స‌మావేశంలో.. భార‌త్‌లో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌జాస్వామ్యం ఉందా అన్న ప్ర‌శ్న‌కు శ్వేత‌సౌధం జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హామండ‌లి స‌మ‌న్వ‌య‌క‌ర్త జాన్ కెర్బీ(John Kirby) మాట్లాడుతూ ఈ వ్యాఖ్య‌లు చేశారు. త్వ‌ర‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ(PM Narendra Modi) అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్న వేళ భార‌త్‌తో మ‌రింత బ‌ల‌మైన, లోతైన స్నేహ‌బంధాన్ని కొన‌సాగిస్తామ‌ని చెప్పారు. అనేక స్థాయిలో అమెరికాకు భార‌త్ బ‌ల‌మైన భాగ‌స్వామి అని వివ‌రించారు.

అమెరికా ర‌క్ష‌ణ మంత్రి ఇప్ప‌టికే షంగ్రిలా స‌ద‌స్సులో భార‌త్‌తో అమెరికా అద‌న‌పు ర‌క్ష‌ణ స‌హ‌కారానికి సంబంధించిన ప‌లు అంశాల‌ను ప్ర‌క‌టించారు. అయితే, ఇరు దేశాల వాణిజ్యంలో చాలా ఇబ్బందులున్నాయ‌ని, కానీ భార‌త్ క్వాడ్‌లో స‌భ్య‌దేశం. ఇండో – ప‌సిపిక్ వ్యూహంలో భార‌త్ చాలా కీల‌క‌మైన భాగ‌స్వామి అని, ఈ సంబంధాలు మా ఇరు దేశాల‌కు మాత్ర‌మే ముఖ్య‌మైన‌వి కావ‌ని జాన్ కెర్బీ పేర్కొన్నారు. అంతేకాదు, మోదీతో ప‌లు అంశాల‌పై చ‌ర్చించి ఇరుదేశాల మ‌ధ్య బంధాన్ని మ‌రింత బ‌లోపేతం చేసేందుకు అధ్య‌క్షుడు బైడెన్ ఎదురు చూస్తున్నార‌ని కెర్బీ వివ‌రించారు.

 

Also Read :  Job in USA: టూరిస్ట్ వీసాతో వెళ్లి యూఎస్ లో ఉద్యోగం వెతుక్కోవచ్చు!

  Last Updated: 06 Jun 2023, 09:18 PM IST