6 Lakhs Tip : రూ.600 బిల్లుకు రూ.6 లక్షల టిప్

రూ.632 బిల్లుకు దాదాపు 6 లక్షల రూపాయల టిప్ ఇచ్చింది. ఇంకేముంది ఆమె చాలా మంచిదని, ఎంతో దాతృత్వంకలగదని సంతోషించారు రెస్టారెంట్ సిబ్బంది.

  • Written By:
  • Publish Date - November 25, 2023 / 06:37 PM IST

6 Lakhs Tip : మనకేదైనా తినాలనిపించినపుడు.. హోటల్ కో, రెస్టారెంట్ కో వెళ్తుంటాం. అక్కడ ఫుడ్ సర్వ్ చేసినవారి తీరును బట్టి.. ఎంతోకొంత టిప్ గా ఇస్తుంటాం. అలా ఓ సబ్ వే రెస్టారెంట్ కు వెళ్లిన మహిళ.. 7 డాలర్ల విలువైన శాండ్ విచ్ తిని.. 7 వేల డాలర్ల టిప్ ఇచ్చి వెళ్లిపోయింది. మన కరెన్సీలో రూ.632 బిల్లుకు దాదాపు 6 లక్షల రూపాయల టిప్ ఇచ్చింది. ఇంకేముంది ఆమె చాలా మంచిదని, ఎంతో దాతృత్వంకలగదని సంతోషించారు రెస్టారెంట్ సిబ్బంది. అయితే అదంతా పొరపాటుగా జరిగిందని తెలిసి ఉసూరుమన్నారు.

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందిన వేరా కార్నర్ ఒక ఇటాలిన్ సబ్ వే లో ఇటీవల ఓ శాండ్ విచ్ తని బిల్లు చెల్లించింది. ఇదే సమయంలో ఆమె ఏమరపాటుగా వ్యవహరించింది. 7.54 డాలర్ల బిల్లు చెల్లించాల్సిన చోట.. పొరపాటుగా తన ఫోన్ నంబర్ కొట్టింది. బ్యాంక్ ఆఫ్ అమెరికా క్రెడిట్ కార్డుతో ఈ ట్రాన్సాక్షన్ చేయగా.. బిల్లు వచ్చాక జరిగిన పొరపాటును గుర్తించింది. ఆ తర్వాత బ్యాంకును సంప్రదించినా ప్రయోజనం లేకపోయింది.

తన సొమ్మును తిరిగి ఖాతాలో జమచేయాలన్న వేరా కోరికను బ్యాంక్ వాళ్లు మొదట తిరస్కరించారు. ఆ తర్వాత సదరు సబ్ వే మేనేజ్ మెంట్ ను ఆశ్రయించగా.. అక్కడి మేనేజర్ తనను బ్యాంకును ఆశ్రయించాలని సూచించాడని.. తిరిగి బ్యాంకుకు వెళ్లగా విచారణ చేసి వేరా సొమ్మును తిరిగి ఇప్పించేందుకు ప్రయత్నిస్తామని తెలిపారు. సబ్ వే మేనేజ్ మెంట్ అందుకు సానుకూలంగా స్పందించగా.. పొరపాటుగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు అంగీకరించడంతో.. వేరా కార్నర్ కు ఊరట లభించింది.

Also Read : 11 People Burnt : ఘోర అగ్ని ప్రమాదం.. 11 మంది అగ్నికి ఆహుతి