Site icon HashtagU Telugu

Hush Money Case : ట్రంప్‌‌కు షాక్.. హష్‌ మనీ కేసులో శిక్ష ఖరారును ఆపలేమన్న సుప్రీంకోర్టు

Hush Money Case Us Supreme Court New York Court

Hush Money Case : హష్‌ మనీ కేసులో ట్రంప్‌కు చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనకు శిక్ష ఖరారు కాకుండా అడ్డుకోలేమని అమెరికా సుప్రీంకోర్టు ప్రకటించింది. దీంతో ఈ వ్యవహారంలో ఇవాళ న్యూయార్క్ కోర్టు తీర్పును వెలువరించేందుకు లైన్ క్లియర్ అయింది.  ట్రంప్‌కు శిక్షపై ఇవాళ తీర్పు వెలువడితే.. శిక్ష ఖరారయ్యాక వైట్ హౌస్‌లోకి అడుగుపెడుతున్న తొలి అమెరికా దేశాధ్యక్షుడిగా ట్రంప్‌ నిలుస్తారు. న్యూయార్క్‌ కోర్టు న్యాయమూర్తి జువాన్‌ ఎం.మెర్చన్‌ ఈ శిక్షను ఖరారు చేయనున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందున, ఆయన శిక్షను అనుభవించాల్సిన అవసరం లేకుండా డిశ్చార్జిని మంజూరు చేయనున్నారు.

Also Read :Canada PM Race : కెనడా ప్రధాని రేసులో ఎంపీ చంద్ర ఆర్య.. ఈయన ఎవరు ?

వాస్తవానికి  హష్‌ మనీ కేసులో 2024 సంవత్సరం నవంబరులోనే ట్రంప్‌కు న్యూయార్క్‌ కోర్టు శిక్షను(Hush Money Case) ఖరారు చేయాల్సి ఉంది.  సరిగ్గా అదే  టైంలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయభేరి మోగించారు. దీంతో హష్‌ మనీ కేసులో తీర్పును ఖరారు చేయకుండా ఆపాలంటూ సుప్రీంకోర్టులో ట్రంప్ పిటిషన్ వేశారు. అమెరికా అధ్యక్షులుగా ఉన్న వారికి క్రిమినల్ విచారణ నుంచి రక్షణ ఉంటుందన్నారు. గతంలోనూ దీనిపై సుప్రీంకోర్టు తీర్పులు వెలువడ్డాయని ట్రంప్ గుర్తు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన అమెరికా సర్వోన్నత న్యాయస్థానం కీలక తీర్పును ఇవాళ ఇచ్చింది. న్యూయార్క్ కోర్టు తీర్పును వెలువరించే ప్రక్రియను తాము ఆపలేమని వెల్లడించింది.

Also Read :Vaikuntha Ekadashi 2025: నేడు వైకుంఠ ఏకాద‌శి.. ఇలా చేస్తే అంతా శుభ‌మే!