డొనాల్డ్ ట్రంప్‌కు భారీ షాక్‌!!

కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడే, ట్రంప్ 1977 చట్టానికి ప్రత్యామ్నాయాలను వెతకడం ప్రారంభించారు. అత్యవసర టారిఫ్‌లను కోర్టు చెల్లవని చెబితే, ఇతర నిబంధనల కింద వేగంగా కొత్త సుంకాలు విధిస్తామని ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు.

Published By: HashtagU Telugu Desk
Trump's warning to Iran

Trump's warning to Iran

Donald Trump: అమెరికా సుప్రీంకోర్టు శుక్రవారం (ఫిబ్రవరి 20, 2026) అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పెద్ద షాక్ ఇచ్చింది. ఇతర దేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ విధించిన టారిఫ్‌లను (సుంకాలను) అత్యున్నత న్యాయస్థానం చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఇంత పెద్ద సంఖ్యలో దేశాలపై టారిఫ్‌లు విధించడం ద్వారా ట్రంప్ తన అధికార పరిధిని ఉల్లంఘించారని కోర్టు తన తీర్పులో పేర్కొంది. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించాల్సిన చట్టాన్ని అడ్డం పెట్టుకుని ట్రంప్ ఈ టారిఫ్‌లు విధించారని కోర్టు విశ్లేషించింది.

6-3 మెజారిటీతో వెలువడిన ఈ తీర్పు అమెరికా ఆర్థిక వ్యవస్థ, వినియోగదారులు, అధ్యక్షుడి వాణిజ్య విధానాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ కేసులో ప్రభుత్వం ఓడిపోతే ఇతర దేశాలతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలను ఉపసంహరించుకోవాల్సి వస్తుందని, దిగుమతిదారులకు భారీగా రీఫండ్‌లు చెల్లించాల్సి ఉంటుందని ట్రంప్ యంత్రాంగం ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది.

టారిఫ్‌లు విధించే అధికారం కాంగ్రెస్‌దే, అధ్యక్షుడిది కాదు

1970ల నాటి అత్యవసర చట్టాన్ని ఉటంకిస్తూ కాంగ్రెస్ (అమెరికా పార్లమెంట్) అనుమతి లేకుండా ఏకపక్షంగా టారిఫ్‌లు విధించిన మొదటి అధ్యక్షుడు ట్రంప్. అయితే ఆ చట్టంలో ఎక్కడా ‘టారిఫ్’ అనే పదమే లేదని కోర్టు ఎత్తిచూపింది.

Also Read: శ్రీరాముడిగా మహేష్ బాబు.. వైర‌ల్ అవుతున్న పోస్ట‌ర్ ఇదే!

100కు పైగా దేశాలపై టారిఫ్‌లు

గత ఏడాది ప్రారంభంలో ట్రంప్ 1977 నాటి ‘ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్’ను ఉపయోగించి 100 కంటే ఎక్కువ దేశాల నుండి వచ్చే వస్తువులపై టారిఫ్‌లు విధించారు. వాణిజ్య లోటును తగ్గించడం, అమెరికాలో తయారీ రంగాన్ని ప్రోత్సహించడం తన ఉద్దేశమని ఆయన చెప్పారు. అప్పటి నుండి ఆయన ఈ టారిఫ్‌లను ఆదాయాన్ని పెంచుకోవడానికి, ఇతర దేశాలతో వాణిజ్య చర్చల్లో ఒత్తిడి తేవడానికి వాడుతున్నారు.

కోర్టును ఆశ్రయించింది ఎవరు?

డజనుకు పైగా రాష్ట్రాలు, విద్యాసంబంధిత బొమ్మల కంపెనీలు, వైన్ దిగుమతిదారులు వంటి చిన్న వ్యాపార సంస్థల సమూహం ఈ టారిఫ్‌లకు వ్యతిరేకంగా కేసు వేశాయి. టారిఫ్‌ల కారణంగా వస్తువుల ధరలు పెరిగాయని, తమ వ్యాపారం దెబ్బతిన్నదని, ఉద్యోగులను తగ్గించుకోవాల్సి వచ్చిందని వారు వాదించారు.

ట్రంప్ వాదన ఏమిటి?

కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడే, ట్రంప్ 1977 చట్టానికి ప్రత్యామ్నాయాలను వెతకడం ప్రారంభించారు. అత్యవసర టారిఫ్‌లను కోర్టు చెల్లవని చెబితే, ఇతర నిబంధనల కింద వేగంగా కొత్త సుంకాలు విధిస్తామని ప్రభుత్వ ప్రతినిధులు తెలిపారు. గతంలో చైనా, కెనడా, మెక్సికోలు ఫెంటానిల్ డ్రగ్ స్మగ్లింగ్‌ను అరికట్టడంలో విఫలమయ్యాయనే నెపంతో ట్రంప్ వాటిపై టారిఫ్‌లు విధించారు. ఆ తర్వాత దాదాపు అన్ని వాణిజ్య భాగస్వాములపై సుంకాలు పెంచారు.

నిగువ కోర్టు తీర్పు కూడా అదే

ఈ కేసు సుప్రీంకోర్టుకు చేరకముందు మూడు దిగువ కోర్టులు కూడా ఈ టారిఫ్‌లను అక్రమమని తేల్చాయి. ఆగస్టులో ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్ కోర్టు 7-4 తీర్పుతో.. “కాంగ్రెస్ అధ్యక్షుడికి టారిఫ్ అధికారం ఇవ్వాలనుకున్నప్పుడు, అది చాలా స్పష్టంగా చెబుతుంది” అని పేర్కొంది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అదే అభిప్రాయాన్ని ఖరారు చేయడంతో ట్రంప్ పాలనలో వాణిజ్య యుద్ధం ఒక మలుపు తిరిగింది.

  Last Updated: 20 Feb 2026, 11:27 PM IST