PM Modi: మోదీతో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భేటీ..

నాలుగు రోజుల భారత పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శనివారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వాణిజ్య, భద్రత సహా కీలక రంగాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌ తరఫున మోదీని వైట్‌హౌస్‌కు ఆహ్వానించారు. ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక భారత్‌-అమెరికా మధ్య వాణిజ్యం విషయంలో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. మరోవైపు ఇరాన్‌ ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమెరికా రాయబారి ట్వీట్ […]

Published By: HashtagU Telugu Desk
US Secretary of State Marco Rubio meets with Modi.

US Secretary of State Marco Rubio meets with Modi.

నాలుగు రోజుల భారత పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో శనివారం ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. వాణిజ్య, భద్రత సహా కీలక రంగాలపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌ తరఫున మోదీని వైట్‌హౌస్‌కు ఆహ్వానించారు. ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చాక భారత్‌-అమెరికా మధ్య వాణిజ్యం విషయంలో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. మరోవైపు ఇరాన్‌ ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో ఈ భేటీ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

అమెరికా రాయబారి ట్వీట్
ఈ చర్చల్లో పాల్గొన్న అమెరికా రాయబారి సెర్గియో గోర్ భేటీ అనంతరం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. ‘‘ప్రధాని మోదీతో సమావేశం అద్భుతంగా సాగింది. భద్రత, వాణిజ్యం, కీలక సాంకేతిక రంగాల్లో అమెరికా-భారత్ సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై ఫలప్రదమైన చర్చలు జరిగాయి. ఈ రంగాలు ఇరు దేశాలను పటిష్ఠం చేయడమే కాకుండా.. స్వేచ్ఛా, బహిరంగ ఇండో-పసిఫిక్ రీజియన్‌ను ముందుకు తీసుకెళతాయి. అమెరికాకు భారత్ అత్యంత కీలకమైన భాగస్వామి’’ అని పోస్ట్‌ చేశారు.

ఇరాన్ వివాదంపై చర్చ?
ప్రపంచ శాంతి భద్రతలపై చర్చించినట్లు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. పాకిస్థాన్ మధ్యవర్తిత్వం వహించిన శాంతి చర్చలు విఫలం కావడంతో ఇరాన్‌పై మళ్లీ దాడులు చేయడానికి ట్రంప్ యోచిస్తున్నారనే వార్తల నడుమ ఈ భేటీ జరిగింది. చర్చల్లో భాగంగా ఇరాన్ సంక్షోభం కూడా ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్, అమెరికా కలిసి పనిచేస్తాయని మోదీ పేర్కొన్నారు.

  Last Updated: 23 May 2026, 05:17 PM IST