Anti Satellite Weapon : శాటిలైట్లపైకి రష్యా మిస్సైల్స్.. అమెరికా సంచలన ప్రకటన

Anti Satellite Weapon : అంతరిక్షంలో శాటిలైట్లు పెరిగిపోతున్నాయి.

  • Written By:
  • Publish Date - February 16, 2024 / 03:34 PM IST

Anti Satellite Weapon : అంతరిక్షంలో శాటిలైట్లు పెరిగిపోతున్నాయి. అగ్రరాజ్యాలన్నీ శాటిలైట్లను పెద్ద ఎత్తున అంతరిక్షంలో మోహరిస్తున్నాయి. ఒకవేళ ప్రపంచ యుద్ధమే సంభవిస్తే.. శాటిలైట్లపైనా ఆయుధాలను ప్రయోగిస్తారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా రష్యాపై అమెరికా ఇదే విధమైన ఓ ఆరోపణ చేసింది. అంతరిక్షంలోని శాటిలైట్లను ధ్వంసం చేసే కెపాసిటీ కలిగి ఉన్న ఉపగ్రహ విధ్వంసక ఆయుధాలను రష్యా డెవలప్ చేస్తోందన్న వార్తలు అమెరికాలో కలకలం రేపుతున్నాయి. ఈ వార్తలు నిజమేనని అమెరికా వైట్ హౌస్ గురువారం ఓ ప్రకటలో తెలిపింది. రష్యా డెవలప్ చేస్తున్న యాంటీ శాటిలైట్ మిస్సైళ్లతో మానవాళికి వచ్చే ప్రమాదమేమీ లేదని వెల్లడించింది.

We’re now on WhatsApp. Click to Join

యాంటీ శాటిలైట్ మిస్సైళ్ల వల్ల అమెరికా జాతీయ భద్రతకు ముప్పు ఉందని కొందరు అమెరికా పార్లమెంటు సభ్యులు ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో వైట్‌హౌస్ ఈ ప్రకటనను రిలీజ్ చేసింది. అయితే ఈ తరహా టెక్నాలజీని డెవలప్ చేసేందుకు రష్యా ప్రయత్నాలు చేస్తుండటం ఆందోళనకరమన్నారు. ఈ మిస్సైళ్లు న్యూక్లియరా ? కాదా ? అనే దానిపై క్లారిటీ లేదని వైట్ హౌస్ చెప్పింది. రష్యా ఈ టెక్నాలజీని వినియోగిస్తే.. 1967లో కుదిరిన ఔటర్ స్పేస్ ట్రీటీని ఉల్లంఘించినట్లు అవుతుందని అమెరికా వాదిస్తోంది. ఈ ఒప్పందంపై ఆనాడు అమెరికా, రష్యా దేశాలు సంతకాలు చేసిన విషయాన్ని వైట్ హౌస్ గుర్తు చేసింది. అంతరిక్షంలో అణ్వాయుధ వినియోగాన్ని ఔటర్ స్పేస్ ట్రీటీ నిషేధించిందని పేర్కొంది.  ఇలాంటి ఆయుధాలతో భూసమీప కక్ష్యలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాలలో ఉండే వ్యోమగాములకు తీవ్ర ప్రమాదం ఉంటుందని అమెరికా(Anti Satellite Weapon) ఆందోళన వ్యక్తం చేసింది.

Also Read :CAG Report on Hyderabad Metro Rail : ఒప్పందాన్ని తుంగలో తొక్కిన హైదరాబాద్ మెట్రో..ఎంత దారుణం ..!!

రష్యా మాత్రం అమెరికా ఆరోపణలను తోసిపుచ్చింది. ఉక్రెయిన్‌కు అదనపు యుద్ధ సాయం అందించేందుకు ఉద్దేశించిన బిల్లును కాంగ్రెస్‌లో (అమెరికా చట్టసభలు) పాస్ చేయించుకునేందుకు వైట్ హౌస్ కొత్తకొత్త కుయుక్తులు పన్నుతోందని ఫైర్ అయింది.  ఉక్రెయిన్‌కు ఆయుధాలు సమకూర్చేందుకు మరో 60 బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం అందించే బిల్లును అమెరికా చట్టసభల్లో పాస్ చేయించుకునేందుకు బైడెన్ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తోంది. అయితే, బైడెన్ ప్రయత్నాలను ప్రతిపక్ష రిపబ్లికన్లు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఎలాగైనా బిల్లు పాస్ చేయించుకునేందుకు బైడెన్ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోందని రష్యా ఆరోపించింది. తాము అలాంటి ఆయుధాలు అభివృద్ధి చేయట్లేదని తేల్చి చెప్పింది.

Also Read : Big Shock : అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ ఆర్డర్లు చేస్తున్నారా ? ‘రీప్లేస్‌మెంట్’ ఇక టఫ్ గురూ